అఖిలప్రియ రాజకీయ భవిష్యత్ ముగిసినట్లేనా…?

Bhuma Akhila Priya Political Crisis

రాజకీయాల్లో ఎక్కడ నెగ్గాలో…ఎక్కడ తగ్గాలో తెలిస్తేనే…రాజకీయా భవిష్యత్తు ఉంటుంది. కానీ కానీ నెగ్గడం కోసం పరిగెడితే…ప్రత్యర్థులను అణిచివేస్తే…అహంకారంతో అందర్నీ దూరం పెడితే….చివరికి మిగిలేది శూన్యం. అచ్చం ఇలానే ఏపీ మాజీ మంత్రి టీడీపీ నేత భూమాఅఖిలప్రియ ప్రవర్తించారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే అఖిలప్రియ మంత్రి అయ్యారు . తొందరగా అధికారం దక్కడంతో అడ్డూ అదుపులేకుండా పోయింది. దీంతో ఆ దూకుడు కాస్త రాజకీయాల్లోనూ ఎక్కువైంది. ఆ దూకుడే ఇప్పుడు అకిలప్రియ కెరీర్ ను ప్రమాదంలోకి నెట్టేసింది. భూమానాగిరెడ్డి దంపతులు మరణించడంతో చిన్న వయస్సులోనే వారి క్రేజ్ తో మంత్రి అయ్యారు భూమా అఖిలప్రియ. ఇప్పుడు ఆమె రాజకీయ భవిష్యత్తు ఎటూ కాకుండా పోతోందని విశ్లేషకులు అంటున్నారు.

ఇక కర్నూలు జిల్లా సీనియర్లను కాదని అఖిలప్రియకు మంత్రిపదవి కట్టబెట్టారు చంద్రబాబునాయుడు. దీంతో ఆమె చిన్నవయస్సులోనే రాజకీయం గురించి తెలియకుండానే అందరిపై ఆధిపత్యం చెలాయిస్తూ…శత్రుత్వాన్ని పెంచేసుకున్నారు. అయినవారితో గొడవలు పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండగా అది చెల్లదు కదా. దీంతో అఖిలప్రియకు కష్టాలు ప్రారంభమయ్యాయి.

ఆమె బాధితులంతా ఏకమయ్యారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో కేసుల మీద కేసులు పెడుతున్నారు. అఖిలప్రియ వ్యవహారశైలికి ఇప్పుడు తగిన మూల్యం చెల్లించుకుంటున్నారు. భర్త భార్గవ్ బెదిరింపులు, తమ్ముడు జగత్ విఖ్యాత్ రెడ్డి దూకుడు…అఖిలప్రియ నిర్ణయాలు…ఇలా ఇప్పుడు ముగ్గురి భవిష్యత్తు అందకారంలోకి వెళ్లింది. ఆ ఫ్యామిలిపై కేసుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఒక్కటా రెండా…కిడ్నాపులు, ఫోర్జరీలు, దోపిడీలంటూ చాలా కేసులే నమోదవుతున్నాయి.

దీంతో పార్టీకి పెద్ద నష్టం వాటిల్లే ప్రమాదం ఉండటంతో భూమాఅఖిలప్రియను చంద్రబాబు కూడా దూరం పెడుతున్నట్లు వార్తలు వినిపిస్తోన్నాయి. ఇప్పటికే తెలుగుదేశం మాజీలు, ఆమెతో మాట్లాడటం మానేసారట. కనీసం జిల్లా కార్యాయలంలో మీడియా సమావేశానికి కూడా ఆమెను అనుమతించడం లేదట. ఇదంతా చూస్తుంటే అఖిలప్రియను టీడీపీ నుంచి గెంటేసినట్లే అనే ప్రచారం సాగుతోంది. చంద్రబాబు అపాయింట్ మెంట్ ఇవ్వడానికి కూడా ఇష్టపడటం లేదట. ఇక అఖిలప్రియ రాజకీయ భవిష్యత్ క్లోజ్ అయినట్లేనన్న చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.

Spread the love