వైరల్ అవుతోన్న థాంక్యూ మోదీజీ ఛాలెంజ్…కసి తీర్చుకుంటున్న ప్రజలు..!

THank You Modiji Petrol copy

ప్రజలు కోపంతో రగలిపోతున్నారు. కోవిడ్ తో ఆదాయం లేక నానాకష్టాలు పడుతున్న తరుణంలో కేంద్రంలోని మోదీ సర్కార్ కర్రకాల్చి వాత పెడుతున్నట్లు తయారైంది. పెట్రోలు, డీజిలు ధరలను భారీగా పెంచేస్తోంది. లీటరు ధర వందరూపాయలు దాటుతున్నా ఆపకుండా దోచేస్తున్నారంటూ కోపంతో రగిలిపోతున్నారు. అందుకే ఇప్పుడు ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర మోదీ ఫోటోలకు దండాలు పెడుతూ ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తున్నారు. థాంక్యూ మోదీజీ ఛాలెంట్ అంటూ ట్రోలింగ్ ప్రారంభించారు. ఇదో పెద్ద ఉద్యమంలాగానే సాగుతోంది.

పెట్రోలు, డీజీల్ ధరలు సెంచరీ దాటాయి. అయినా పరుగులు ఆపడంలేదు. అందుకే పెట్రోల్ పోయించుకోవడానికి వచ్చిన వాహనదారులు ఇప్పుడు మోదీ చిత్రపటానికి దండం పెడుతూ థాంక్యూ మోడీజీ అంటూ నిరసన రాగం ఎత్తుకుంటున్నారు. వ్యంగ్యంగా తెలుపుతున్న ఈ నిరసన ఇప్పుడు సామాజిక మాద్యమాల్లో ట్రెండింగ్ లో నిలిచింది. థాంక్యా మోదీజీ ఛాలెంట్ హ్యాగ్ ట్యాగ్ తెగ వైరల్ అవుతోంది. మోదీ పరువుతీసేలా కొందరు బట్టలన్నీ విప్పేసీ వాహనాలపై నిలబడి మోదీకి దండం పెడుతున్నారు. ఇంకొందరు తమ క్రియేటివిటితో ఫోటోలు యాడ్ చేసి సర్కార్ పై హోరెత్తిస్తున్నారు.

ఇక గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్రోలు ధరలు పెంచినప్పుడు యూపీఏ, మోదీ చేసిన ట్వీట్లను బయటకు తీసి కొందరు నెటిజన్లు ఓ ఆటఆడుకుంటున్నారు. పెట్రో ధరలపై సహనం నశించిన జనం ఇప్పుడు ఇలా దండం పెడుతూ తమ కోపాన్ని మోదీకి తగిలేలా హోరెత్తిస్తున్నారు.

అటు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ట్రెండింగ్ ను అక్షరాల వాడుకుంటోంది. ఈ ట్రెండ్ ను అందిపుచ్చుకుంటూ బీజేపీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతుందటంతో పెట్రోలు, డీజిల్ ధరల పెంపుపై చర్చకు ప్రతిపక్ష కాంగ్రెస్ పట్టబడుతూ బీజేపీని టార్గెట్ చేస్తోంది.

అయితే దేశ ప్రజలు చేస్తోన్న ఈ థాంక్యూ మోదీజీ ఛాలెంట్ కు బీజేపీ నేతలకు ఎలా కౌంటర్ ఇవ్వాలో అర్థంకావడంలేదు. ఎందుకంటే పెట్రోల్ రేట్లు దేశంలో భారీగా పెరిగిపోతున్నాయి. కాంగ్రెస్ అధికారం లో ఉన్న రాష్ట్రాలలో కూడా పెంచుతున్నాయని బీజేపీ మద్దతుదారులు అనడం తప్ప ఏం చేయలేని పరిస్థితి వారిది.

Spread the love