ప్రధాని నోట…బాహుబలి ప్రస్తావన…ఎందుకంటే..?

Pm Modi about Bahubali Movie

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్బంగా సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని నరేంద్రమోదీ సందేశమిచ్చారు. ఆయన తన సందేశంలో టాలీవుడ్ సెన్సెషనల్ హిట్ మూవీ బాహుబలి ప్రస్తావనకు తీసుకువచ్చారు. ఈ సారి ప్రత్యక్షంగా సమావేశాలు జరుగుతున్నాయి..ఈ సమావేశాలకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. ముఖ్యమైన అంశాలపైనే ప్రధానంగా చర్చించనున్నారు.

అందరూ టీకా తప్పకుండా వేసుకోవాలి. టీకా వేసుకుంటే బాహుబలిలా మారవచ్చు. సభలో అర్థవంతమైన చర్చలు జరగాలి. ప్రతిపక్షాలు లేవనెత్తే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు రెడీగా ఉన్నామని మోదీ అన్నారు.
ఇక గతంలోనూ మోదీ బాహుబలి సినిమాను ప్రస్తావనకు తెచ్చారు. పలు ఎన్నికల ప్రచారాల్లో చాలాసార్లు బాహుబలి గురించి మాట్లాడారు. దీంతోపాటుగా మీడియాతో మాట్లాడుతున్న సందర్భం వర్షం కురుస్తుండటంతో మోదీ తన గొడుగును తానే పట్టుకున్న సెంటరాఫ్అట్రాక్షన్ గా నిలిచారు. ప్రధాని మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. కనీసం ఒక్కడోసు వ్యాక్సిన్ అయినా తీసుకోనివారు ఉంటారని…ఆశిస్తున్నానని మోదీ పేర్కొన్నారు.

ఇప్పటికి 40కోట్లకుపైగా ప్రజలు బాహుబలులుగా మారారని..టీకా తీసుకున్న వారి గురించి ప్రస్తావించారు. కోవిడ్ మహమ్మారి కట్టడి చర్యలపై ఈ మధ్యే అన్ని రాష్ట్రాల సీఎంతోనూ తాను చర్చించానని…ఈ సమావేశాల్లో కూడా అదే చేయాలనుకుంటన్నట్లు మోదీ తెలిపారు.

ఇక ఈ సమావేశాలు ఫలవంతంగా సాగాలని ప్రజల సందేహాలకు సమాధానాలు లభించాలని ఆశిస్తున్నానంటూ మోదీ అన్నారు. విపక్ష సభ్యులు కఠిన ప్రశ్నలను లేవనెత్తుతూ…సమావేశం సజావుగా సాగేలా సహకరించాలని కోరారు. సర్కార్ అన్ని విషయాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉందన్నారు.

అటు సోమవారం ఉదయం 11గంటలకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు షురూ అయ్యాయి. మొదట 4గురు కొత్త ఎంపీలతో స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. వీరిలో ఈ మధ్యే తిరుపతి లోక్ సభ స్థానం నుంచి గెలుపొందిన వైసీపీ ఎంపీ గురుమూర్తి కూడా ఉన్నారు. ఇక ఈ సమావేశాలు ఇవాళ్టి నుంచి ఆగస్టు 13వరకు సాగానున్నాయి. ఈ సమావేశాల్లో 17 కొత్త బిల్లులు, 2 ఆర్థిక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

Spread the love