కోర్టుకు రాలేను….డ్యాన్స్ మాత్రం ఇరగదీస్తా…

Pragya Thakur Dance Viral Video

బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్….కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్. ఇప్పుడు ఆమెకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. కొన్ని రోజుల క్రితం బాస్కెట్ బాల్ ఆడుతున్న వీడియో హల్ చల్ చేసింది. ఇప్పుడు ఓ పెళ్లికి హాజరైన ఎంపీ ఎంతో ఉత్సాహంగా చిందులు వేస్తున్న వీడియో సోషల్ మీడియా కంటపడింది. భోపాల్ లో ఇద్దరు నిరుపేద యువతుల వివాహానికి హాజరైన ప్రగ్యా ఠాకూర్…అప్పగింతల సమయంలో డీజే పెట్టారు. ఇక డీజే సౌండ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. మ్యూజిక్ తగ్గట్లు అతిథులతో కలిసి తాను డ్యాన్స్ ఇరగదీసింది. ఆరోగ్యపరమైన సమస్యల కారణంగా ఎప్పుడూ వీల్ చైర్ లోనే కనిపించే ప్రగ్యా…ఒక్కసారిగా బాస్కెట్ బాల్ ఆడటం…ఇలా చిందులు వేయడం చూసి కొందరికి షాక్ తగిలినంత పనైంది.

ఇక ఆ వీడియోలు కాస్త వైరల్ కావడంతో కాంగ్రెస్ నేతలు ఊరుకుంటారా…ఛాన్స్ దొరికింది కదా అని నోటికి పని చెబుతున్నారు. మాలెగావ్ పేలుళ్ల కేసులో ఎంపీ ప్రగ్యా ఠాకూర్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విచారణలో భాగంగా కోర్టకు హాజరు కావాలని కోర్టు ఆదేశాలు పంపించగా…ఆరోగ్యం బాగలేదని విచారణకు హాజరుకాలేనని ప్రగ్యా తెలిపారు. ఇప్పుడు ఈ వీడియో విషయానికి వస్తే…మధ్య ప్రదేశ్ లోని ఇద్దరు అమ్మాయిల వివాహం ఒకే ముహుర్తానికి జరుగుతోంది. ఆ అమ్మాయిలు పేదలు కావడంతో వారి వివాహం ప్రగ్యా తన నివాసంలో జరిపిస్తుందట. ఈ సమయంలో డప్పుల సౌండ్ కు ప్రగ్యా డ్యాన్స్ చేశారు. చిన్న చిన్న స్టెప్పులతో అలరిస్తూ…పెళ్లికి వచ్చిన వారిని కూడా తనతోపాటు డ్యాన్స్ చేపించారు. ఆ డ్యాన్స్ వీడియో ఎవరు తీశారో కానీ ఇప్పుడు వైరల్ గా మారింది.

ఏది ఏమైనా ప్రగ్యా ఆరోగ్యం పూర్తిగా మెరుగైనట్లు అనిపిస్తోందంటూ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు.

Spread the love