టీటీడీపీ కొత్త అధ్యక్షుడు బక్కని నరిసింహులు..!

TTDP new President narasimhulu

ఇంతకాలం తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడిగా ఉన్న ఎల్ రమణ కారెక్కారు. దీంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. ఖాళీ అయిన స్థానాన్ని భర్తీ చేశారు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు. తెలంగాణ టీడీపీ కొత్త అధ్యక్షుడి బాధ్యతలను బక్కని నర్సింహులుకు అప్పగించారు చంద్రబాబు.

బక్కని నరసింహులు చాలా కాలంగా చంద్రబాబుకు మంచి సన్నిహితుడిగా ఉన్నారు. ఈయన 1994-97వరకు షాద్ నగర్ టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేవారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. అయినప్పటికీ పార్టీ మారకుండా చంద్రబాబుకు టీడీపీకి విధేయుడిగా ఉంటున్నారు. పలు నామినేటెడ్ పోస్టుల్లోనూ నర్సింహులుకు చంద్రబాబు అవకాశం ఇచ్చారు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టీటీడీ బోర్డు సభ్యుడిగా నర్సింహులును నామినేట్ చేశారు. టీడీపీలో జాతీయ కార్యదర్శి పదవికూడా ఇచ్చారు. అయితే ఇప్పటివరకు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా కొనసాగిన ఎల్ రమణ టీఆరెస్ లో చేరడంతో…కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకునేందుకు చంద్రబాబు తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశం నిర్వహించారు. తొలుత టీడీపీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి, కొత్తకోట దయాకర్ రెడ్డి, అరవింద్ కుమార్ గౌడ్ పేర్లు తెరపైకి వచ్చాయి. అనారోగ్య కారణాల వల్ల ఈ పదవిని వారు స్వీకరించేందుకు నిరాకరించినట్లు తెలిసింది.

ఈ క్రమంలోనే షెడ్యూల్ కులాలకు చెందిన బక్కని నర్సింహులును సామాజిక కోణంలో ఎంపిక చేసినట్లు సమాచారం. బీసీల పార్టీ అయిన తెలుగుదేశంకు ఈయన ఎంపిక సరిపోతుందంటున్నారు. ఇక టీడీపీకి వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించునున్నట్లు సమాచారం. ఇక తెలంగాణ టీడీపీ పార్టీ నుంచి దాదాపుగా దిగ్గజ నేతలంతా కూడా పలు పార్టీల్లోకి వెళ్లిపోయారు. రేవంత్ రెడ్డి , ఎల్ రమణ, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీహరి లాంటి వాళ్లు టీఆరెస్ లో చేరారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇంతకాలం పనిచేసిన ఎల్ రమణ తాజాగా రాజీనామా చేశారు. దీంతో ఆఖరి ఆశ కూడా ఆవిరైపోయింది. దీంతో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.

ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణలో పార్టీని బతికించుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తున్నాడని సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచే అవకాశాలు లేవని తెలిసి కూడా…అసెంబ్లీ ఎన్నికల టార్గెట్ గా చంద్రబాబు కార్యాచరణ రూపొందిస్తున్నారంట. టీటీడీపీ చీఫ్ పదవిని భర్తీ చేశాడు. చంద్రబాబు కూడా కుల సమీకరణాలు ప్రజాదరణ సీనియార్టీ కొత్త అధ్యక్షుడిని నియమించడానికి విధేయత వంటి పలు అంశాలను పరిగణలోనికి తీసుకుని ఈ నియామకం చేపట్టారంట.

ఇక తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎంపికైన సందర్భంగా బక్కని నర్సింహులు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అటు చంద్రబాబునూ కలిశారు. నర్సింహులును లోకేష్, చంద్రబాబు అభినందించారు.

Spread the love