ఆ సీఎం…అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు…!

CM Stalin Holds Convoy copy

తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టినప్పటినుంచి అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు సీఎం స్టాలిన్. సామాన్యులతో ఆయన కలిసిపోతున్న తీరు చూస్తుంటే ముచ్చట కలిగిస్తోంది. సడెన్ గా రోడ్లమీదకు రావడం…సామాన్యులతో కలుపుగోలుగా మాట్లాడటం…వారి కష్టసుఖాలు తెలుసుకోవడం..ఇదంతా చూస్తున్న జనం ప్రశంసలు కురిపిస్తున్నారు.

తాజాగా తమిళనాడులోని పిన్నవాసల్ అనే చిన్న పట్టణంలో పెళ్లి చేసుకున్న రాజమణి-రామ అనే ఇద్దరు సామాన్య జంట రోడ్డు పక్కన నిలుచున్నారు. రోడ్డుమీదుగా అటు వైపు వెళ్తున్న సీఎం స్టాలిన్ వారిని చూసి ఆగిపోయారు. ఈ జంట తమను ఆశీర్వదించేందుకు ముఖ్యమంత్రి ఆగాడని తెలుసుకుని ఆనందంలో మునిగిపోయారు.

రోడ్డు పక్కన పెళ్లి దుస్తుల్లో నిలుచున్న కొత్త జంటను చూసిన సీఎం స్టాలిన్ క్వాయన్ ను ఆపమని ఆదేశించాడు. తాను ప్రయాణిస్తున్న వాహనం నుంచి బయటకు వచ్చి…ఆ జంట దగ్గరకు వెళ్లి వారిని ఆశీర్వదించాడు.

ఈ సడెన్ షాకింగ్ ఘటనకు వధూవరులు ఇద్దరూ ఆశ్చర్యపోయారు. ఒక రాష్ట్రానికి సీఎం తమను పలకరించడానికి కాన్వాయ్ ఆపడం చూసి అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. ఆయన ఆశీర్వాదం కోరుతూ ముఖ్యమంత్రి స్టాలిన్ కాళ్లను మొక్కారు.

ఈ కొత్త జంటను సీఎం స్టాలిన్ ఆశీర్వదించాడు. తర్వాత తన స్వస్థలమైన తిరుకువైకి ప్రయాణం అయ్యారు. ఈ సంఘటన చూపరులను కదిలించింది. ముఖ్యమంత్రి స్టాలిన్ ఇంత సామాన్యుడిగా మెలగడం చూసి అందరూ సంతోషిస్తున్నారు.

Spread the love