భారత్‌కు సాయం చేయడం అమెరికా నైతిక బాధ్యత..

America about Helping India

కరోనా వ్యాప్తిచెందుతున్న వేళ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారత్ కు సాయం చేయడం అమెరికా నైతిక బాధ్యత గా తీసుకోవాలని ఇండో అమెరికన్ కాంగ్రెస్ సభ్యురాలు ప్రమీలా జయపాల్ వెల్లడించారు. కరోనా రెండో దశ కారణంగా ప్రస్తుతం ఇండియాలో నెలకొన్న ఎన్నో విషాదకరణ ఘటనలపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారత్ లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉందన్నారు. ప్రతిరోజు లక్షకు పైగా కేసులు నమోదవుతున్న తరుణంలో ఆసుపత్రుల్లో రోగులకు బెడ్స్ లభించడం లేదన్నారు. దీనికి తోడు ప్రాణవాయివు కొరత కూడా తీవ్రంగా వేధిస్తోందన్నారు. సరైన సౌకర్యాలు లేక కోవిడ్ రోగులు చనిపోతున్నారన్నారు. ఈ సమయంలో అమెరికా భారత్ కు సాయం అందించాలని చెప్పారు. అంతేకాదు…భారత్ కు తోడుగా నిలిచేందుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కృషి చేయడం అమెరికా నైతిక బాధ్యతని ప్రమీలా ఈ సందర్భంగా వెల్లడించారు.

అమెరికాలోని భారత రాయబారి తరణ్ జీత్ సింగ్ సంధుతో వర్చువల్ మీటింగ్ సందర్భంగా ఆమె భారత్ లో నెలకొన్న తాజా పరిస్థితులపై మాట్లాడారు. అనంతరం భారతీయ అమెరికన్ కమ్యూనిటీకి చెందిన అడ్వొకేట్స్ స్థానిక నేతలు, ఎన్నారైలను కలిశారు. ప్రెసిడెంట్ బైడెన్ అడ్మినిస్ట్రేషన్ను భారత్ కు అన్నివిధాల సాయం అందించేందుకు సిద్ధంగా ఉండాలని కోరినట్లు తెలిపారు

ఇక కొవిడ్ వ్యాక్సిన్ల కొరత ఉన్న నేపథ్యంలో అమెరికా తీసుకున్న నిర్ణయాలు భారత్ కు ఎంతగానో ఉపయోగపడుతున్నట్లు చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ల లభ్యత, ధనిక దేశాల్లో 80శాతం ఉండగా..పేద దేశాల్లో కేవలం 0.3శాతం మాత్రమే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా ప్రతినిధుల సభలో మొదటి, ఏకైక భారతీయ అమెరికన్ కూడా ప్రమీలా జయపాల్ కావడం విశేషం. కరోనా బారిన పడిన ఆమె తల్లిదండ్రులను పరామర్శించేందుకు ఇటీవల భారత్ లో పర్యటించారు.

Spread the love