గూగుల్ కి ధీటుగా మరో సంస్థ…

Google Vs Huawei

ప్రస్తుతం ఉన్న డిజిటల్ యుగంలో ప్లే స్టోర్ అంటే తెలియని వారుండరు. మనకి ఏ యాప్ కావాలన్నా మొదటగా మన అందరికీ గుర్తుకు వచ్చే ఏకైక పదం ప్లే స్టోర్. ఎవరు ఏ కొత్త యాప్ ని కనిపెట్టిన తొలుత దాన్ని ప్లే స్టోర్ లో అప్లోడ్ చేస్తారు. ఆ తర్వాత అందరికీ మా యాప్ ని మీ మొబైల్ లోని ప్లే స్టోర్ ద్వారా డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకొని ఉపయోగించుకోవచ్చు అని చెప్తారు.
ఇప్పుడు అన్నీ మొబైల్ కంపెనీలు తమ ఆండ్రోయిడ్ మొబైల్ లలో డిఫాల్ట్ గా గూగుల్ కి సంబందించిన ప్లే స్టోర్ తో పాటు గూగుల్, క్రోమ్, మాప్స్ ని అందిస్తున్నాయి. అయితే ఇక మీదట ఆండ్రోయిడ్ మొబైల్ లలో ప్లే స్టోర్ కి ప్రత్యామ్నాయంగా సరికొత్తగా మరో అప్లికేషన్ రాబోతోంది. అదే యాప్ గ్యాలెరీ. ప్రముఖ హువాయి సంస్థ తయారు చేసిన ఈ అప్లికేషన్ ఇక మీదట తయారు అయ్యే ప్రతి ఒక్క హవాయి మొబైల్ లో డిఫాల్ట్ గా కనిపించనుంది. కొంత కాలం క్రితం అమెరికా ప్రభుత్వం హవాయి సంస్థ ఉత్పత్తులపై నిషేదం విధించిన సంగతి అందరికీ తెలిసిందే. తదనంతరం గూగుల్ కూడా తన సర్వీసులను హవాయి మొబైల్ లలో నిలిపివేసింది. అప్పటినుండి హవాయి సంస్థ ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రత్యేక ధృష్టి సారించింది.
ఆ ప్రయత్నాల ఫలితమే ఈ యాప్ గ్యాలరీ.. ఈ యాప్ గ్యాలరీ తో పాటు హవాయి సంస్థ మరికొన్ని ప్రత్యేక యాప్ లను గూగుల్ కి ధీటుగా తయారు చేసింది. గూగుల్ మాప్స్ కి ప్రత్యామ్నాయంగా Map My India. క్రోమ్ కి బదులుగా JIO Browser ని ఈ సంస్థ తయారు చేసింది. APP Gallery లో దాదాపుగా భారతీయులు వాడే అన్నీ యాప్ లను ఈ సంస్థ పొందుపరిచింది. భవిష్యత్తులో మొత్తం అన్నీ యాప్ లను అనుసంధానం చేయడానికి ఈ సంస్థ తన ప్రయత్నాలను మొదలు పెట్టింది. అలాగే త్వరలో హవాయి సంస్థ విడుదల చేయనున్న Hawayi 9X Pro లో ఈ యాప్ లను డిఫాల్ట్ గా అందించనుంది.

Spread the love