మోడీ దెబ్బకు చైనాకు దిగిపోయింది…జింగ్ పింగ్ కు నిద్రలేదట

Modi vs CHina

ఈ ప్రపంచం తమదే అంటూ చైనా మొబైల్‌ ఫోన్స్‌ ప్రపంచాన్ని చుట్టేశాయి. దేశంలో పెరిగిన సమాచార విప్లవంతో.. ప్రతి ఇంటికి… కాదుకాదు… ప్రతి వ్యక్తి చేతికి ఫోన్‌ అందుబాటులోకి వచ్చింది. పెరిగిన సాంకేతికతతో స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. మనదేశంలోనూ మొబైల్స్‌ పోటెత్తాయి. పిల్లలు, పెద్దలు, ఉన్నవాడు, లేనివాడన్న తేడాలేకుండా అందరికీ మొబైల్స్‌ అందుబాటులోకి వచ్చాయి. దీంతో మొబల్స్‌ ప్రపంచ మార్కెట్‌లో చైనా అగ్రస్థానంలో ఉంది. మొబైల్‌ రంగంలో చైనా ఫోన్‌లదే హవా నడుస్తోంది. ముఖ్యంగా మార్కెట్‌లో టాప్‌సేల్స్‌లో ఉన్న డజన్‌కుపైగా స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలు చైనాకు చెందినవే. అయితే ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయ్యింది.

భారత మార్కెట్‌లో రాజ్యమేలుతోన్న చైనా వస్తువులను బహిష్కరించాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. జిత్తులమారి డ్రాగన్‌కు గట్టిగా బుద్దిచెప్పాలంటే… ముందు చైనాకు ఆర్థికంగా ఆయువుపట్టుగా ఉన్న భారత మార్కెట్‌ను దూరం చేయాలని కోరుతున్నారు. చైనా వస్తువులకు వ్యతిరేకంగా ఇప్పుడు సోషల్‌ మీడియాలో క్యాంపెయిన్‌ కూడా స్టార్ట్‌ అయ్యింది. మరోవైపు ప్రజలు కూడా పెద్ద ఎత్తున చైనా వస్తువులకు వ్యతిరేకంగా రోడ్డెక్కుతున్నారు. దీంతో ఇండియా మొబైల్‌ రంగంలో రాజ్యమేలుతోన్న చైనా మొబైల్‌ బ్రాండ్‌లపై తీవ్రప్రభావం చూపనుంది.

ప్రస్తుత స్మార్ట్‌ మొబైల్లో… యాపిల్‌, శాంసంగ్, ప్యానాసోనిక్‌ ఇలా ఓ నాలుగైదు కంపెనీలు మినహాయిస్తే.. మిగతావన్నీ చైనాకు చెందిన మొబైల్‌ బ్రాండ్సే. చైనాకు చెందిన షియోమీ, ఎంఐ , రెడ్‌మీ, వన్‌ప్లస్‌, వివో, ఒప్పో, రియల్‌మీ, లెనోవా, మియాజు, కూల్‌ప్యాడ్‌ జోపో మొబైల్‌, డజనుకుపైగా చైనా కంపెనీల ఫోన్‌లో ఉన్నాయి. ఇవన్నీ మార్కెట్‌లో టాప్‌ప్లేస్‌లో ఉన్నాయి. చైనా వస్తువుల బాయ్‌కాట్‌ మూవెంట్‌ సక్సెస్‌ అయితే మాత్రం చైనా మొబైల్స్‌ కంపెనీలకు గడ్డుపరిస్థితి తప్పదు.

మొబైల్ తయారీ రంగంలో చైనాను అధిగమించడమే భారత్ లక్ష్యమని కేంద్ర టెలికాం, ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. భారత్‌ను ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందన్నారు. పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ వార్షిక సర్వసభ్య సమావేశంలో మాట్లాడిన ఆయన..ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ తయారీదారుగా భారత్ మారాలని కోరుకుంటున్నానని అన్నారు.

చైనాను అధిగమించడమే భారత్‌ లక్ష్యమని ఆయన వెల్లడించారు. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రభుత్వం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని ప్రవేశపెట్టి ప్రపంచ దిగ్గజ కంపెనీలను ఆకర్షిస్తోందని ఆయన పేర్కొన్నారు. అన్ని రంగాలకు ఈ పథకాన్ని విస్తరించాలని చూస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా తయారీ రంగంలో భారత్‌ను ప్రత్యామ్నాయంగా మార్చాలనే ఉద్దేశ్యంతోనే పీఎల్ఐ పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు.

దీని ద్వార ఇప్పటివరకు దేశీయ, విదేశీ కంపెనీలు సుమారు రూ. 11 వేల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. అంతేకాకుండా రాబోయే ఐదేండ్లలో రూ. 10.5 లక్షల కోట్ల విలువైన మొబైల్‌ఫోన్‌లను తయారు చేయనున్నట్టు రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. పెట్టుబడులు పెట్టిన కంపెనీల జాబితాలో అంతర్జాతీయ సంస్థలు శాంసంగ్, యాపిల్ సహా పెగాట్రాన్, విస్ట్రాన్ లాంటి కంపెనీలు ఉన్నాయని చెప్పారు. దేశీయ సంస్థలైన మైక్రోమ్యాక్స్, ఆప్టిమస్, లావా సంస్థలు మొబైల్‌ఫోన్ ఉత్పత్తులను పెంచుతాయని పేర్కొన్నారు.

Spread the love