నల్లమల కు పెరుగుతున్న మద్దతు

నల్లమల ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఇదో సంచలనం దాక్షిణాదిలో అతి పెద్ద అరణ్యం ఇది ఎన్నో జీవరసులకు అండగా కొన్ని తెగల వారికి జీవనాధారంగా ఉన్న మహా అరణ్యం ఇది. ప్రస్తుతం నల్లమలలో యురేనియం నిఖెపాలు ఉన్నాయన్న అంచనాతో అక్కడ తవ్వకాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది అనే ఉద్ధేశ్యంతో నల్లమలలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా #SaveNallamala పేరుతో తెలుగు రాష్ట్రాలలో ఒక ఉద్యమం నడుస్తుంది ఈ ఉద్యమాన్ని మొదట ప్రారంబించింది ప్రకృతి ప్రేమికులే అయినా దీనిని కాంగ్రెస్ తమ ఉద్యమంగా మార్చుకుని మార్చుకొని ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ అధినేత కే‌సి‌ఆర్ లక్ష్యంగా విమర్శలు చేస్తుంది. తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ యువతను ప్రభావితం చెయ్యగల పవన్ కల్యాణ్ ను కాంగ్రెస్ సీనియర్ నేత అయిన వ హనుమంతరాఓ కలిసి ఆయన మద్దతుని కోరారు దీనికి పవన్ కళ్యాణ్ కూడా మద్దతునిచ్చారు. దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ ఎం‌పి రేవంత్ రెడ్డి రోజూ తన గలాన్ని ప్రజాలలోకి తీసుకెట్లు ఉధ్యమాన్ని ముందుకు నడుపుతున్నారు ఇదే అంశంపై రేవంత్ రెడ్డి పవన్ కల్యాణ్ ను కలవనున్నారు. ఈ ఉద్యమానికి పలువురు సినీ తారలు కూడా మద్దతు పలికారు. కథానాయిక సమంత చేంజ్.ఓఆర్‌జీ సంస్థ ద్వారా రాష్ట్రపతికి పంపుతున్న పిటిషన్‌పై సంతకం చేసి తన మద్దతు తెలిపారు. మరో నటి అనసూయ కూడా మద్దతుగా సంతకం చేశారు. కథానాయకుడు విజయ్ దేవరకొండ ట్విటర్లో స్పందిస్తూ- యురేనియం తవ్వకాల వల్ల నల్లమల నాశనమయ్యే ప్రమాదంలో ఉందని, యురేనియం కొనుక్కోవచ్చుగానీ అడవులను కొనుక్కోలేం కదా అని వ్యాఖ్యానించారు. తాజాగా ఈ విషయంపై రాష్ట్ర ఐ‌టి మంత్రి కే‌టి‌ఆర్ స్పందించారు. యురేనియం తవ్వకాలపై వ్యక్తమవుతున్న ఆందోళనను తాను పరిగణనలోకి తీసుకొంటున్నానని, దీనిని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దృష్టికి తీసుకెళ్తానని మంత్రి ట్వీట్ చేశారు. మంత్రి ట్వీట్ ను  రిట్వీట్ చేస్తూ ఇది తమ తొలి విజయమని విజయ్ దేవేరకొండ తెలిపారు. “నల్లమల పరిరక్షణ జరిగే వరకు ఆపొద్దు. నల్లమలా! నీకు బేషరతుగా మద్దతు తెలిపే కోట్ల మంది సోదర సోదరీమణులున్నారు” అని ఆయన తెలిపారు. ఇదే విషయంపై మరో కథానాయకుడు గోపీచంద్ మాట్లాడుతూ- “చెట్లు బాగుంటే మనం బాగుంటాం. వాటిని నాశనం చేస్తే మన జీవితాన్ని మనం చేతులారా నాశనం చేసుకున్నట్లే. నల్లమలను రక్షించుకొందాం” అన్నారు. నల్లమలను రక్షించుకోవడం తమ కర్తవ్యం అని కథానాయకులు రామ్, బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ కూడా ట్విటర్‌లో చెప్పారు. ఈ ఉధ్యమానికి సినీ ప్రముఖులంతా మద్దతు తెలుపుతున్నారు.

తాజాగా ఇదే విషయంపై  మాజీ మంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ నల్లమలలో యురేనియం తవ్వాకానికి తమ ప్రభుత్వం ఎలాంటి అనుమతి ఇవ్వలేదని 2009 లోనే కాంగ్రెస్ ప్రభుత్వం నల్లమల లో యురేనియం అన్వేషణకి మాత్రమే అనుమతినిచ్చింది అని ఇందులో తమ ప్రభుత్వం తప్పు ఏం లేదని అనవసరంగా కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై తీర్మానలను స్పీకర్ ముందు ప్రవేశ పెట్టి వాటిని కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని ఆయన సూచించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *