పాకీస్థానీలతో పరిణయం వద్దు….

Pak vs Saudi

సౌదీ అరేబియా తన దేశంలోని పురుషులకు గట్టి షాకిచ్చింది. ఇప్పటి వరకు ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్న సౌదీ అరేబియా …తమ దేశానికి చెందిన పురుషులు బంగ్లాదేశ్, చాద్, మయన్మార్, పాకిస్తాన్ దేశాలకు చెందిన మహిళలను వివాహం చేసుకోవడంపై నిషేధం విధించింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ మీడియాకు చెందిన డాన్ రిపోర్టు వెల్లడించగా…సౌదీ విడుదల చేసిన ఈ ఉత్తర్వులు దేశంలో కలకలం రేపుతున్నాయని పేర్కొంది. అధికారికంగా ఈ నాలుగు దేశాలకు చెందిన 5 లక్షల మంది సౌది అరేబియాలోనే ఉన్నారు.

అయితే సౌదీ సర్కార్ తీసుకున్న కొత్త నిబంధనతో…ఆ దేశ పురుషులు విదేశీ మహిళలను పెళ్లి చేసుకోవడం కష్టంగా మారిందని మక్కా డైలీ దిన పత్రిక వెల్లడించింది. ఇన్నాళ్లుగా సౌదీ అరేబియా ప్రజలు ఈ నాలుగు దేశాల్లోని ప్రజలను పెళ్లి చేసుకోవాలంటే ఎలాంటి కండిషన్స్ ఉండేవి కావు. కానీ తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఈ దేశాలకు చెందిన మహిళలను పెళ్లి చేసుకోవాలనుకుంటే…కఠిన నిబంధనలు అడ్డంగా ఉంటాయని మక్కా డైలీ రిపోర్టులో పేర్కొంది.

అసలు ఈ నాలుగు దేశాలపైన్నే ఇన్ని ఆంక్షలు, నిషేధం విధించడం ఎందుకంటే….గత కొన్నేండ్లుగా సౌదీ అరేబియాలో విదేశీ మహిళల్ని పెళ్లి చేసుకునేవారి సంఖ్య గణనీయంగా పెరిగిపోయిందట. ఈ పరిస్థితులన్నింటికీ చెక్ పెట్టాలన్న ఉద్దేశం పాలకుల్లో ఉందట. అందుకే ఇంత కఠిన నిర్ణయాలు తీసుకోవల్సి వచ్చిందని రిపోర్టు చెబుతోంది. ఇక తప్పనిసరిగా ఆ నాలుగు దేశాలకు చెందిన మహిళల్ని ఎవరన్నా పెళ్లి చేసుకోవాలనుకుంటే మాత్రం కొన్ని రూల్స్ పాటించాల్సిందేనట.

విదేశీ మహిళను మ్యారేజ్ చేసుకోవాలనుకున్న సౌదీ పురుషులు….పెళ్లికి ముందు తప్పనిసరిగా ప్రభుత్వానికి అప్లికేషన్ ఒకటి పెట్టుకోవాలి. ప్రభుత్వం దాన్ని ఆమోదించాలో లేదో నిర్ణయిస్తుంది. ఇక ఎవరన్న డైవర్స్ తీసుకుని మరో పెళ్లి సిద్ధమయినట్లయితే…ఆరు నెలల వరకు వెయిట్ చేయాల్సిందేనట. అప్లికేషన్ పెట్టుకునేవారి వయస్సు 25ఏళ్లు దాటి ఉండాలి. అప్లికేషన్ పై ముందుగానే స్థానిక డిస్ట్రిక్ మేయర్ సంతకం కూడా ఉండాలి. ఐడీకార్డులు, ఫ్యామిలీ కార్డు సమర్పించాల్సి ఉంటుంది.

Spread the love