రఘురామపై సీఐడీ ఆగ్రహం…!

AP CID fires on Raghu rama Krishnam Raju

నరసాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు తన గోయి తానే తవ్వుకున్నట్లుంది ఆయన వ్యవహారం చూస్తుంటే. దర్యాప్తు సంస్థలను పక్కదారి పట్టించేలా వ్యవహరించడంతో…ఏపీ సీఐడీ సీరియస్ అయ్యింది. గత నాలుగైదు రోజులుగా తన సెల్ ఫోన్ ను సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకోవడంపై రఘు రామ కృష్ణం రాజు ఫిర్యాదులు, లీగల్ నోటీసుల పేరుతో హల్ చల్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

ఈ నేపథ్యంలో రఘురామకు సీఐడీ తాజాగా గట్టి కౌంటర్ ఇచ్చింది. రఘురామ తమకు చెప్పిందానికి , ఢిల్లీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుకు చాలా వ్యత్యాసం ఉందని సీఐడీ స్పష్టం చేసింది. ఈ మేరకు సీఐడీ ఏం చెప్పిందో తెలుసుకుందాం.

సెల్ ఫోన్ విషయంలో రఘురామ తప్పుదారి పట్టిస్తున్నారు. మే 15న రఘురామ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నాం. అందులో ఉన్నది ఫలానా నెంబర్ అని చెప్పాడు. ఇద్దరు సాక్షుల ముందు రఘురామ స్టేట్ మెంట్ కూడా నమోదు చేసుకున్నాం. సెల్ ఫోన్ సీజ్ చేసిన అంశాన్ని సీఐడీ కోర్టుకు కూడా తెలిపాం.

ఇక ఆయన యాపిల్ ఫోన్ను విశ్లేషించేందుకు గాను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించాం. రఘురామ ఫోన్ డేటాను మే 31న కోర్టుకు అందించాం తన మొబైల్ సీజ్ చేసిట్లు ఢిల్లీ పోలీసులకు రఘురామ ఫిర్యాదు చేసినట్లు మీడియాలో వచ్చిన వార్తలను గమనించాం. తన మొబైల్ నెంబర్ అంటూ ఢిల్లీ పోలీసులకు వేరే ఫోన్ నెంబర్ ఇచ్చారు. మే 15న రఘురామ మాకు చెప్పినదానికి, ఢిల్లీ పోలీసుల ఫిర్యాదులో ఇచ్చిన నెంబర్ లో తేడా ఉంది. దర్యాప్తు సంస్థలను పక్కదారి పట్టించేలా రఘురామ ఫిర్యాదు ఉందంటూ సీఐడీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.

అసలు సమస్యను పక్కదారికి పట్టించేందుకు కొత్త సమస్యలను తెరపైకి తీసుకువస్తున్నారనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగానే సెల్ ఫోన్ అంశాన్ని తెరమీదకు తీసుకువస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏదో విధంగా తనపై నమోదైన కేసు గురించి కాకుండా…వేరే అంశాలపై చర్చను మళ్లించేందుకే ఇదంతా అని విమర్శించే వాళ్లు ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ వ్యవహారంపై కోర్టులోనే తేల్చుకునేందుకు సీఐడీ రెడీ అయినట్లు …తాజాగా వెలువడిన ప్రకటనను చూస్తే అర్ధమవుతోంది. మున్ముందు ఏం జరుగుతుందో చూద్దాం.

Spread the love