సాహో నిజంగా ఫ్లాప్ అయిందా..?

సాహో ఈ సినిమా గురుంచి ప్రస్తుతం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఎంధుకంటే గత మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాలలోనే కాదు దేశ వ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించిన సినిమా ఇది. అయితే ఈ సినిమాపై తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా నెగెటివ్ టాక్ వినపడింది అసలు దీనికి కారణం ఏంటి నిజంగానే సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందా…? ఈ ప్రశ్నలు సగటు ప్రేక్షకుడిని వేదిస్తున్నాయి. నిజంగా సినిమా విషయానికి వస్తే సినిమాలో యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ ని సైతం డీకొట్టేలా ఉన్నాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు. మనం ఒకసారి హాలీవుడ్ సినిమాలు పరిశీలిస్తే వాటిలో కథ కంటే కూడా

కథనానికి సినిమాలోని కొన్ని సన్నివేశాలు మాత్రమే ఆ సినిమాను అందలానికి ఎక్కిస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లను చేపట్టిన అవతార్ సినిమా కథ మన తెలుగు లో ఎన్నోసార్లు చిత్రీకరించిన అడవుల కు సంబందించిన సినిమాలను పోలి ఉంటుంది కానీ ఆ సినిమా సాంధించిన విజయం అంతా ఇంతా కాదు. అందులో ని వినూత్న ప్రయోగాలు గ్రాఫిక్స్ ఆ సినిమాను ఆ స్థాయికి తీసుకెల్లాయి. మన తెలుగు చిత్ర సీమ లో కూడా భారీ వసూళ్లను సాదించిన బాహుబలి కథ కూడా మన ప్రేక్షకులకు కొత్త ఏం కాదు కానీ ఆ సినిమాను ప్రేక్షకులు ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. అంటే ఇప్పటి సినిమాల్లో కథ మాత్రమే ప్రాధాన్యం కాదు. మిగిలిన విషయాలలోకి వస్తే సినిమాలో అవసరమైన దాని కంటే కూడా భారీగా ఖర్చు పెట్టారు అనే వాదన వినిపిస్తుంది. కానీ సినిమాలో కొన్ని సన్నివేశాలకు

ఆ మాత్రం ఖర్చు అలాంటి ప్రదేశాలు లేకపోతే అది బాలీవుడ్ ప్రియులను మెప్పించలేమనేది వాస్తవం. అంటే సినిమాకు అవి కూడా సమస్య కాదు. అయితే సినిమాకు ఏది సమస్యగా మారింది అనే విషయానికి వస్తే ముఖ్యంగా సినిమాలో ఉన్న అనేక ట్విస్ట్ లు ప్రేక్షకులను కొంచెం తికమక కు గురిచేశాయి కానీ వాటిని అర్దం చేసుకున్న వారికి మాత్రం అదొక భారీ చిత్రం. ఇక సినిమాను భారీగా దెబ్బతీసిన అంశం ఎవరూ ఒప్పుకోకపోయినా అందరికీ తెలిసిన వాస్తవం తెలుగు రాష్ట్రాలలో కుల అంశం అందరికీ ఉంది అనే విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే…

బి‌జే‌పి నేత ప్రభాస్ పెదనాన్న అయిన కృష్ణం రాజు చంద్రబాబు ను ఉద్దేశించి “చంద్రబాబు చచ్చిన పాము” అనే అంశాన్ని పట్టుకొని కొంతమంది టి‌డి‌పి నేతలు సాహో కి వ్యతిరేకంగా ప్రచారం మొదలు పెట్టారు ఆ ప్రచారాన్ని నారా లోకేశ్ ఖండించిన ఆ ఖండన ప్రజలలోకి వెళ్లలేదు అలాగే గోదావరి జిల్లాలోనే ఎక్కువ సంఖ్యా బలం ఉన్న ఒక వర్గం కూడా సాహో ను వ్యతిరేకించింది అనేది తెర వెనుక సంగతే. ఇక వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విడుదల చేసిన కమ్మ రాజ్యంలో కడప రెడ్డ్లు పాట ప్రోమో కూడా ఈ సినిమాకు కులం రంగు పులిమిందనే  చెప్పాలి. మొత్తానికి కొన్ని సామాజిక వర్గాలు కలిసి సినిమా ఫ్లాప్ అయింది అని వ్యతిరేక ప్రచారం మొదలు పెట్టారు. సహజంగా ప్రజలు విజయానికి సంబందించిన వార్తల కంటే వివాద వార్తలకు బాగా దగ్గరవుతారు అలాగే వారి వెనకే మీడియా కూడా ఉండటంతో సాహో కు కాస్త నెగెటివ్ టాక్ వచ్చిందనే చెప్పాలి మొత్తానికి ఎవరు ఎంత నెగెటివ్ టాక్ తెచ్చినా దేశీయ మీడియా మరియు బాలీవుడ్ ప్రజలు మాత్రం సినిమాను బాగానే ఆదరించారు. అదే విదంగా ప్రపంచ వ్యాప్తంగా సాహో రాబట్టిన వసూళ్లు సుమారుగా తొలి రెండు రోజుల్లోనే రూ 200 కోట్ల మార్కును దాటాయి అంటే ఆ సినిమా స్థాయి ఎంతో మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. కనుక రివ్యూ లు రేటింగ్ లు అని చూడకుండా కుదిరితే ఆ సినిమా కు వెళ్ళి చూసి మీ సొంత నిర్ణాయనికి రండి. అన్నిటికి మించి సినిమా అనేది ఒక వినోద సాధనం అని గుర్తుంచుకొని వాటికి కుల మత రంగు పులమకుండా ఉంటే మంచిది.

 

నటీనటులు: ప్రభాస్, శ్రద్ధా కపూర్, అరుణ్ విజయ్, జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, చుంకీ పాండే, మందిరా బేడీ, వెన్నెల కిషోర్, మురళీ శర్మ తదితరులు
సంగీతం: శంకర్ ఎహసాన్ లాయ్
సినిమాటోగ్రఫీ: మధి

ఎడిటర్: శ్రీకర ప్రసాద్
కథ, దర్శకుడు: సుజీత్
నిర్మాతలు: వంశీ ప్రమోద్

 

ఇది సినిమా చూసిన వీక్షకుడి సొంత అభిప్రాయం మాత్రమే దయచేసి పరిగణించగలరని మా మనవి.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *