ప్రభుత్వానికి అంబానీ ప్రశ్నల వర్షం..

Ambani Direct Question to Govt

మహారాష్ట్రలో సరికొత్త పరిణామం చోటుచేసుకుంది. ఎప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోరుమెదపని వ్యాపార దిగ్గజం నోటి వెంట తొలిసారిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది…. మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా అనిల్ అంబానీ కుమారుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిగ్గా మారాయి. మహారాష్ట్ర సర్కార్ తీసుకున్న నిర్ణయంపై ప్రముఖ బిజినెస్ మెన్ అనిల్ అంబానీ పెద్ద కుమారుడు…అన్మోల్ అంబానీ చేసిన కాంమెట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

మహారాష్ట్రలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాపారాలపై  ప్రభుత్వం విధించిన ఆంక్షలపై వారు అభ్యంతరం చెప్పారు. నటులు, క్రికెటర్లు, రాజకీయనేతలు వారందరికీ లేని ఆంక్షలు కేవలం వ్యాపారాలకు మాత్రమే ఎందుకు అంటూ సీరియస్ అయ్యారు. ఎసెన్షియల్ అంటే ఏంటంటూ ఓ కొత్త ప్రశ్నను సంధించారు. తనకొచ్చిన కొన్ని సందేహాల్ని ట్విట్టర్ ద్వారా ప్రజలతో పంచుకుంటూ మహా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎవరి పనివారికి ముఖ్యమే అంటూ ప్రభుత్వానికి మింగుడపడని విధంగా ఆయన స్పంధించారు. ప్రొఫెషనల్ నటులు వారి సినిమా షూటింగ్ లు చేసుకోవచ్చు. క్రికెటర్లు అర్థరాత్రి వరకు అడవచ్చు. రాజకీయనేతలు భారీ సంఖ్యలో జనాన్ని పోగుచేసి ర్యాలీలు, సభలు నిర్వహించుకోవచ్చు. కానీ వ్యాపారం మాత్రం చేయవద్దు… అంటూ ప్రశ్నలు వర్షం కురిపించారు. ఇక మహారాష్ట్రలో కేసులు తీవ్రత భారీ సంఖ్యలో నమోదు కావడం తెలిసిందే.

అత్యధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్న రాష్ట్రంగా మహారాష్ట్ర దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. దేశ వ్యాప్తంగా లక్షకేసులు నమోదవుతుంటే..అందులో సగానికి సగం మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. దీంతో మహా సర్కార్ అక్కడ పాక్షిక లాక్ డౌన్ విధించారు. రాత్రి కర్ఫ్యూతోపాటు…వీకెండ్ లో పూర్తి లాక్ డౌన్ ను విధించారు. ఈ సమయంలోనే అనిల్ అంబానీ కుమారుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దీనిపై మహా రాష్ట్ర ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సిందే.

Spread the love