జగన్ సాబ్ Vs వకీల్ సాబ్ ఏపీలో సినిమా రాజకీయం…

Pawan Kalyan Vakeel Saab

ఆంద్రప్రదేశ్ రాజకీయాల్లో వకీల్ సాబ్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా తిరుపతి ఉపఎన్నికల వేడిని పెంచింది. ఎందుకంటే జనసేన, బీజేపీ అభ్యర్థి రత్నప్రభ బరిలోకి దిగడంతో, బీజేపీ నేతలు కూడా వకీల్ సాబ్ సినిమా విషయంలో స్పందిస్తున్నారు. అటు సాధారణంగా పెద్ద సినిమాలకు పండగ టైమ్‌లో అదనపు షోలకు అనుమతులు ఇస్తూ.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు గతంలో జీవోలు విడుదల చేసేవి. అలాగే ఈ మధ్య టిక్కెట్‌ రేట్లు కూడా పెంచుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. అయితే ‘ఉగాది’ కానుకగా విడుదల కాబోతోన్న ‘వకీల్‌ సాబ్‌’ విషయంలో మాత్రం ఇప్పుడు ఏపీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తుందంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు థియేటర్లలో తనిఖీలు చేసిన ఏపీ రెవిన్యూ అధికారులు.. టికెట్ ధరలు పెంచేందుకు అనుమతిలేదని, ఒకవేళ టికెట్ ధరలు పెంచితే థియేటర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. మిగతా హీరోల సినిమాలకు టికెట్ రేట్లు పెంచేందుకు అవకాశం ఇచ్చి.. తమ హీరో సినిమాకు ఎందుకు అనుమతి ఇవ్వరని జనసైనికులు ఏపీ ప్రభుత్వంపై సీరియస్‌ అవుతున్నారు. డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులు కొందరు ఈ విషయంపై ఏపీ హైకోర్టు‌ను సంప్రదించగా.. కోర్టు వారికి సానుకూలంగా తీర్పును ఇస్తూ ఆర్డర్స్ జారీ చేసింది. మూడు రోజుల పాటు టికెట్స్ రేట్స్ పెంచుకోవచ్చంటూ.. ఏపీ హైకోర్టు తీర్పు ఇస్తూ.. ఏపీలోని 13 జిల్లాల జాయింట్ కలెక్టర్స్‌కు, అలాగే ఏపీ ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వేణు వెంటనే ఏపీ ప్రభుత్వం డివిజన్ బెంచ్ కి అప్పేయల్ చేసుకుంది. డివిజన్ బెంచ్ ఏపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ వకీల్ సాబ్ సినిమా టికెట్ ధరను పెంచుకోవడానికి సింగల్ బెంచ్ ఇచ్చిన తీర్పు ని కొట్టి వేస్తూ టికెట్ ధరను పెంచడానికి అనుమతి లేదు అంటూ తీర్పుని వెల్లడించింది..
వకీల్ సాబ్ వెనుక కుట్ర ఎందుకు… అటు బీజేపీ నేతలు కూడా వకీల్ సాబ్ అడ్డంకులపై ఘాటుగా స్పందిస్తున్నారు. ఏపీ బీజేపీ ఇన్ చార్జ్ సునీల్ దేవధర్ అయితే తిరుపతిలో వకీల్ సాబ్ థియేటర్ ముందు నిల్చొని ఏపీ సీఎం జగన్ కు వార్నింగ్ ఇవ్వడం కొసమెరుపు. అటు వకీల్ సాబ్ చిత్రం కూడా పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ప్రభుత్వం కూడా అనవసరంగా జోక్యం చేసుకొని మరింత రచ్చ చేసి ఫ్రీ పబ్లిసిటీ ఇస్తోందని వైసీపీకి చెందిన నేతలే అంతర్గతంగా కామెంట్స్ చేస్తున్నారు. మరి సినిమాల్లో బలంగా కంబ్యాక్ ఇచ్చిన వకీల్ సాబ్, రియల్ పొలిటికల్ లైఫ్ లో కంబ్యాక్ ఎప్పుడు ఇస్తాడు అనేది ప్రశ్నగా మారింది.

Spread the love