ఏపీ ఉద్యోగ సంఘాల నేతల్లో అలజడి మొదలైందా…?

AP Emplyees Protest against leaders

ఏపీ ఉద్యోగ సంఘాల నేతల్లో అలజడి షురూ అయ్యిందా…? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఉద్యోగ సంఘాల నేతలు..తమ సంక్షేమం తామే చూసుకుంటున్నారు కానీ ఉద్యోగుల గురించి పట్టించుకోవడం లేదన్న అసహనం కనపడుతోంది. నోరు తెరిస్తే చర్యలు బెదిరింపులు…అస్సలు నోరు తెరవనివ్వడం లేదు. కానీ ఎంత కాలం ఇలా భరించాలి. అందుకే ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. సంఘం నాయకులపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రస్తుతం సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఉన్న వెంకట్రామిరెడ్డిపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు డైరెక్టుగానే లేఖలు రాస్తున్నారు. అంతేకాదు వాటిని సామాజిక మాధ్యమాల్లో కూడా షేర్ చేస్తున్నారు. దీంతో విషయమంతా తెలిసిపోతుంది. సెక్రటేరియట్ ఉద్యోగ సంఘంలో గతంలో కీలకంగా పనిచేసిన రామారావు అనే ఉద్యోగి రాసి లేఖ ఇప్పుడు వైరల్ అవుతోంది.

అయితే వెంకటరామిరెడ్డి మాత్రం ఎప్పుడూ కూడా ఉద్యోగుల కోసం మాట్లాడిన సందర్భాలు లేవు. సర్కార్ కు మద్దతివ్వడం సామాజిక బాధ్యత అంటూ రెచ్చిపోతున్నారు తప్పా..ఉద్యోగుల బాగోగులు చూసుకున్న పాపానాపోలేదు. కరోనాతో చనిపోతే వారికి అందాల్సిన బెనిఫిట్స్ తోపాటు…కారుణ్య నియామకాల ద్వారా పిల్లలకు అవకాశం ఇప్పించేందుకు వెంకటరామిరెడ్డి కనీసం ప్రయత్నం కూడా చేయలేదు. అయితే నిమ్మగడ్డ స్థానిక ఎన్నికలు నిర్వహిస్తాన్నప్పుడు…ఉద్యోగుల తరపున తిరుగుబాటు చేసేందుకు ప్రయత్నాలు చేసిన వెంకటరామిరెడ్డి అప్పట్లో అందరికీ టీకాలు వేయించాలని డిమాండ్ చేశారు. టీకాలు అందుబాటులోకి వచ్చాక…ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వెంకటరామిరెడ్డి వ్యక్తిగతంగా పెద్దెత్తున ప్రభుత్వం నుంచి పలు మార్గాల్లో లబ్ది పొందుతున్నారని విస్త్రుత స్థాయిలో ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో ఆయక కూడా ఉద్యోగుల గురించి కాకుండా ఇతర సంఘాలను నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేస్తున్నారన్న ఆరోపణలు కూడా తీవ్ర స్థాయిలో వస్తున్నాయి.

వెంకటరామిరెడ్డి ప్రభుత్వాధినేతల చేతుల్లో పావుగా మారాడన్న విమర్శలు కూడా వస్తున్నాయి ఆయనపై ఈపాటికే మరో ఉద్యోగ సంఘం నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు తీవ్ర ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఉద్యోగులు ఒక్కొక్కరుగా తమ ఆగ్రహాన్ని బయటకు చూపిస్తుండడంతో…ఉద్యోగ సంఘాల నేతలు, పీఆర్సీ గురించి, ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ గురించి, కోవిడ్ కష్టాల గురించి మాట్లాడటం ప్రారంభించారు. సీసీఎస్ విధానాన్ని రద్దు చేయాలన్న ప్రకటనలు కూడా చేస్తున్నారు మరికొన్ని రోజులు ఇలాంటి పరిస్థితులు ఎదురైతే ఉద్యోగులు తిరుగుబాటు తప్పకపోవచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి.

Spread the love