తీవ్ర అసంతృప్తిలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి..

YV Subba Reddy Discontent on YS Jagan

ఏపీలోని అధికార వైసీపీ పార్టీలో అంతర్గతంగా అసంతృప్తి రాజుకుంటోంది. పార్టీలో అంతర్గతంగా వర్గ పోరు తయారుచేసే స్థాయికి చేరిందని పార్టీలో చర్చ జరుగుతోంది. మొన్నటివరకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తమకు జిల్లాలో ప్రాధాన్యం లేదని, అధికారులు ఎవరూ తమ మాట వినడం లేదని బాధపడుతూ వచ్చారు. జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో బహిరంగంగానే కొందరు అసంతృప్తి వ్యక్తంచేశారు. దీనిపై పార్టీ అధినేత సమక్షంలోనే పంచాయితీ జరిగింది. మరోవైపు ఎన్నికలకు ముందు పార్టీ మారిన వారికి మంత్రి పదవులు, అలాగే కీలక పదవులు దక్కడంతో ముందునుంచి ఉన్నవారికి అన్యాయం జరిగిందని ఫీలవుతున్నారు. మరోవైపు అధినేత జగన్ అపాయింట్ మెంట్ ఎమ్మెల్యేలకు నెలల తరబడి దొరకడం లేదని, జిల్లాల్లో అభివృద్ధి పనులకు నిధులు దక్కడం లేదని, జిల్లాల్లో రోడ్లు అధ్వాన్నంగా తయారు అయ్యాయని, కేవలం సంక్షేమ పథకాలు, పప్పుబెల్లాలతో జనం సంతృప్తి చెందుతారు అనుకుంటే పొరపాటని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరోవైపు కరోనా దెబ్బతో ఉపాధి పెద్ద సమస్యగా మారింది. ఇదిలా ఉంటే తాజాగా జగన్ కు అత్యంత సన్నిహితుడు, పార్టీ వ్యవస్థాపక సభ్యుడు మాజీ ఎంపీ, ప్రస్తుత టీటీడీ చైర్మన్ వైవీ. సుబ్బారెడ్డి కూడా జగన్ తీరు పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా పార్టీని నిలబెట్టడం కోసం వైవీ. సుబ్బారెడ్డి తొలినాళ్లలో చాలా కష్టపడ్డారు. ఆర్థికంగా కూడా చాలా నష్టపోయారు. 2014 ఎన్నికల సమయంలో హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డు సమీపంలో పార్టీ ఖర్చుల కోసం తన స్వంత స్థలాన్ని రూ.80 కోట్లకు అమ్మేసినట్లు తెలిసింది. అయితే అది ప్రస్తుతం దాదాపు రూ.400 కోట్లు పలుకుతోందని, తెలిసింది.

అంతేకాదు 2019 ఎన్నికల్లో కనీసం సుబ్బారెడ్డికి టిక్కెట్ కూడా దక్కలేదు. టీటీడీ చైర్మన్ పోస్టు మాత్రమే ఇచ్చారు. ఇక కనీసం రాజ్యసభ సభ్యత్వం కూడా వైవీ సుబ్బారెడ్డికి దక్కలేదు. ఎక్కడో గుజరాత్ నుంచి వచ్చిన రిలయన్స్ ప్రతినిధి పరిమళ్ నత్వానీకి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు. కానీ కష్టపడి పార్టీ కోసం అన్ని రకాలుగా నష్టపోయిన సుబ్బారెడ్డికి మాత్రం తిరుపతి ప్రసాదం మాత్రమే మిగిలింది. అని ఆయన సన్నిహితులు వాపోతున్నారు. దీనికన్నా రాజకీయాలకు దూరంగా ఉండి వ్యాపారం చేసుకుంటే అంతకు పది రెట్లు సంపాదించి ఉండేవారని, సుబ్బారెడ్డి సన్నిహితులు వాదిస్తున్నారు. పార్టీలో తొలి నుంచి ఉన్నవారిని పట్టించుకోకుండా. మధ్యలో వచ్చిన అవంతి శ్రీనివాస్ లాంటి వాళ్లు పదవులు ఎగరేసుకుపోయారని సన్నిహితులు వాపోతున్నారు.

Spread the love