బీజేపీ గాలితీసిన రేవంత్ రెడ్డి..!

Revanth reddy shocking comments against BJP

తెలంగాణలో సత్తాచాటుతాం. వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే. సొంత బలంతోనే అధికారంలోకి వస్తాం. ఇది తెలంగాణ బీజేపీ నేతలు పదే పదే చెబుతున్నారు. వారికి కంగుతినిపించేలా కామెంట్ చేశారు యువ పొలిటికల్ ఫైర్ బ్రాండ్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తాజాగా ఓ టీవీ ఛానెల్లో ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడారు. పలు ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే జరిగే హుజురాబాద్ ఉపఎన్నిక గురించి ప్రస్తావించారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ 1983నుంచి విజయం సాధించలేదని స్పష్టం చేశారు.

అయితే…తాను ఇప్పుడు ఒక ప్రయత్నం చేస్తానన్నారు. గెలిచేందుకు గట్టిగా ప్రయత్నిస్తానని చెప్పారు. ఈ క్రమంలోనే సర్వశక్తులు వడ్డతానన్నారు. అంతేకాదు…ఈ ఉపఎన్నికలో విజయం కోసం….అధికార పార్టీ కేంద్రంలో ఉన్న బీజేపీలు భారీ ఎత్తున డబ్బులతో రంగంలోకి దిగుతున్నాయన్నారు. దీనికి సుమారు రెండు వందల కోట్లను ఆయాపార్టీలు ఖర్చు పెట్టేందుకు సిద్దంగా ఉన్నారన్నారు. అయితే తాను మాత్రం తన పార్టీ శ్రేణులతో రంగంలోకి దిగి…పార్టీని గెలిపించుకునే ప్రయత్నం చేస్తానని రేవంత్ వ్యాఖ్యానించారు.

ఇదేకాదు…తాను చేసే ప్రయత్నంలో ఓవర్ నైట్ అద్భుతాలు జరిగిపోతాయని తాను భావించడం లేదన్నారు. తన లక్ష్యం మాత్రం 2023 ఎన్నికలేనన్నారు. ఇదే సమయంలో బీజేపీ గురించి మాట్లాడారు. హుజురాబాద్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు ఆ పార్టీ నేతలు ప్రకటిస్తున్నప్పటికీ…ఇది వాస్తవం కాదు అని అన్నారు. ఎందుకంటే ఇక్కడి నుంచి బీజేపీ తరపున బరిలోకి మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు ఈ నియోజకవర్గంపై మంచి పట్టుంది. ఆయన 2004 నుంచి గెలుస్తూ వస్తున్నారు. కేవలం జెండా మాత్రమే మారింది తప్ప…ఆయన ఓటు బ్యాంకు, ఇమేజ్ ఎక్కడా చెక్కు చెదరలేదన్నారు.

అయితే హుజురాబాద్ లో ఈటల విజయం సాధిస్తే…అది ఆయన వ్యక్తిగత ఇమేజ్ కిందే చూడాల్సి ఉంటుందన్నారు. దీనిని బీజేపీ విజయంగా చూడలేమన్నారు. హుజురాబాద్ లో బీజేపీ హవాలేదు…మరి ఈటలను ఎలా గెలుపిస్తుందని ప్రశ్నించారు. ఈటల గెలిచినా..అది బీజేపీ క్రెడిట్ కాదన్నారు. ఇది పూర్తిగా ఈటల సత్తాచాటుకున్నట్లే అవుతుందన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర బీజేపీలో చర్చనీయాంశంగా మారాయి. ఈటలను గెలిపించుకుంటామన్న నేతలు లోలోన ఆలోచనలోపడిపోయారు. నిజం చెప్పాలంటే రేవంత్ రెడ్డి చెప్పిన మాటలే వాస్తవమని…ఈటల విజయం సాధిస్తే…అది ఆయన సొంతమని రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతుండటం గమనార్హం.

Spread the love