కరోనా వైరస్ 2015లోనే పుట్టిందట…!

Did COrona Virus Created in 2015

కరోనా వైరస్ పై చైనా వాదనలను అంగీకరించడానికి ప్రపంచం సిద్ధంగా లేదు. కరోనా వైరస్ జన్మించిన దేశంగా చైనా కేవలం 6 నుండి 8 నెలల్లో సాధారణ స్థితికి ఎలా తిరిగి వచ్చింది. అనే దానిపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక దేశాలు ఈ వ్యాధితో 2 సంవత్సరాలుగా పోరాతున్నాయి. ఇప్పుడు ఒక కొత్త నివేదిక వెల్లడి కరోనా వైరస్ కు సంబంధించి చైనా కుట్రలపై అనుమానాన్ని పెంచుతుంది. ఈ నివేదిక 2015 కరోనా వైరస్ జీవ రసాయన ఆయుధంగా ఉపయోగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇది మాత్రమే కాదు, మూడవ ప్రపంచ యుద్ధాన్ని జీవ ఆయుధాలతో పోరాడాలని చైనా సైనిక శాస్త్రవేత్తలు ఊహించారు. యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ అందుకున్న ఇంటెలిజెన్స్ పత్రాలు ఇఫ్పుడు మీడియా చేతికి చిక్కాయి.

మరోవైపు కరోనా వైరస్ దానంతట అదే పుట్టలేదని ది వీకెండ్ ఆస్ట్రేలియన్ జర్నల్ వెల్లడించింది. కరోనా వైరస్ అనేది అకస్మాత్తుగా వచ్చిందేమీ కాదని తేల్చి చెప్పింది. 2015 నుంచే చైనా క‌రోనా వైర‌స్‌పై ప‌లు ప‌రిశోధ‌న‌లు జరుపుతున్నట్లు వెల్లడించింది. చైనా సైన్యం ఆరేళ్ల క్రితమే కరోనా వైరస్‌ను బయో వెపన్ గా ఉపయోగించడానికి కుట్ర పన్నిందని వెల్లడించింది. ఈ విష‌యాన్ని చైనా రీసెర్చ్ డాక్యుమెంట్ ను బేస్ చేసుకుని ది వీకెండ్ ఆస్ట్రేలియన్ జర్నల్ కథనాన్ని వెల్లడించింది.

ఆరేళ్ల కిందటే సార్స్ వైరస్ సహాయంతో చైనా బయో వెపన్స్ తయారు చేయడానికి ప్రయత్నించింద‌ని ది వీకెండ్ ఆస్ట్రేలియన్ నివేదిక తేల్చి చెప్పింది. చైనా శాస్త్రవేత్తలు, ఆరోగ్య అధికారులు 2015 నుంచే కరోనాకు సంబంధించిన వివిధ స్ట్రెయిన్ల గురించి పరిశోధనలు జరిపినట్లు పేర్కొంది. ఆ రీసెర్చ్ సమయంలో చైనా శాస్త్రవేత్తలు కరోనా వైరస్ ను మూడవ ప్రపంచ యుద్ధంలో జీవ ఆయుధంగా ఉపయోగించాలని చర్చించినట్లు వెల్లడించింది. దీనిని అంటువ్యాధిగా ఎలా మార్చాలి అనే అంశంపైనా చర్చ జరిగినట్లు తేల్చింది. కరోనా వైరస్‌ వూహాన్ లోని జంతు మార్కెట్ నుంచి వ్యాప్తి చేయలేమని ఆస్ట్రేలియా సైబర్ సెక్యూరిటీ ఎక్స్ ఫర్ట్ రాబర్ట్ పాటర్ తెలిపారు. ఆ వాదన ముమ్మాటికీ తప్పేనని వెల్లడించారు. తాము చైనీస్ రీసెర్చ్ డాక్యుమెంట్స్ స్టడీ చేస్తున్నట్లు చెప్పారు. చైనా శాస్త్రవేత్తల కుట్రపూరిత ఆలోచ‌నా తీరు ఇందులో తేలుతుందన్నారు.

గత ఏడాది అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగా కరోనాను చైనీస్ వైరస్ అని చాలా సార్లు చెప్పారు. ఈ వైరస్ ను ముమ్మాటికీ చైనా ల్యాబ్ లో రూపొందించార‌ని ఆయన కుండ బద్దలు కొట్టారు. అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీల దగ్గర దీనికి సంబంధించిన ఆధారాలున్నట్లు వెల్లడించారు. వాటిని ప్రపంచం ముందు ఉంచుతామని ట్రంప్ అప్ప‌ట్లో చెప్పారు. అయితే ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోయి, బైడెన్ అధికారం చేప‌ట్టాక అత‌ని అడ్మినిస్ట్రేషన్ దీని గురించి స్పందించ‌లేదు. కానీ ఈ విషయంపై అమెరికా దర్యాప్తు కొనసాగుతుందని పలు పరిశోధన సంస్థలు వెల్లడించాయి.

Spread the love