ఎవరెస్ట్ పైనా కోవిడ్ ఆంక్షలు..

COVID 19 Precautions on Everest Tower

కరోనా వైరస్ ప్ర‌పంచంలోని అతి ఎత్త‌యిన ప‌ర్వ‌తం పైనా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఎవరెస్ట్ యొక్క బేస్ క్యాంప్లో, డజన్ల కొద్దీ ప్రజలు కోవిడ్ -19 తో బాధపడుతున్నారు. కరోనా వైరస్ యొక్క రెండవ వేవ్ నేపాల్‌లో కొనసాగుతోంది. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ నుండి 30 మందికి పైగా తరలించారు. ఎవరెస్ట్ చైనా మరియు నేపాల్ సరిహద్దులను విభజిస్తుంది. శిఖరం యొక్క ఉత్తర భాగం చైనా వైపు వస్తుంది. ఈ నేపథ్యంలో చైనా తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ మహమ్మారి మళ్లీ తమ వైపు రాకుండా అప్ర‌మ‌త్త‌మైంది. నిజానికి ఎవ‌రెస్ట్ పర్వతం నేపాల్‌లో ఉన్నా.. దాని ఉత్త‌ర భాగం చైనా ఆధీనంలో ఉంది. ఆ వైపు నుంచే ప‌ర్వ‌తారోహ‌కులు ఎవ‌రెస్ట్ పైకి వెళ్తారు. ఈ కారణంగా తమ వైపు వారికి వైర‌స్ సోక‌కుండా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటుంది.

ఇప్పటికే ఎవరెస్టు మీద ప్రత్యేకంగా ఓ లైన్ ఏర్పాటు చేసింది. త‌మ వైపు నుంచి ఈ పర్వతాన్ని ఎక్కిన వాళ్లు ఆ లైన్ దాట‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది. ఉత్త‌ర‌, ద‌క్షిణ వైపు నుంచి ఎక్కే క్లైంబ‌ర్స్ మ‌ధ్య సంబంధాలు లేకుండా చూసుకుంటుంది. చైనా వైపు నుంచి వ‌చ్చే వాళ్లు శిఖ‌రంపైకి ఎక్కే ముందే వారికి అన్ని రకాల టెస్టులు చేయడంతో పాటు తగు జాగ్రత్తలతో ఓ మెనూ అందిస్తున్నారు. కరోనా రాకుండా తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తున్నారు. ఈ ఏడాది ఎవ‌రెస్ట్ ఎక్క‌డానికి 21 మందికి చైనా ఓకే చెప్పింది. ఏప్రిల్ నుంచే వీళ్లంతా టిబెట్‌ లోని బేస్ క్యాంపులో క్యారంటైన్ కాలం గడిపారు.

అటు త‌మ వైపు ఉన్న ఎవ‌రెస్ట్ స‌మీపంలో వైర‌స్ లేకుండా చూడ‌టానికి సాధార‌ణ టూరిస్టుల‌ను సైతం ఇప్పటికే రాకుండా చేసింది. నుంచి క‌రోనా కార‌ణంగా విదేశీ క్లైంబ‌ర్స్‌ ను కూడా రానివ్వడం లేదు. కేవ‌లం త‌మ దేశ ప‌ర్వ‌తారోహ‌కుల‌కే అనుమ‌తి ఇచ్చింది. నేపాల్ కూడా గ‌తేడాది ఇలాగే చేసినా.. టూరిజాన్ని మ‌ళ్లీ గాడిలో ప‌డేసేందుకు ఈసారి విదేశీ టూరిస్టుల‌ను కూడా అనుమ‌తించింది.

Spread the love