మాస్క్ పెట్టుకోకుండా…రూ.58కోట్లు ఫైన్ కట్టారు..

Penalties for Violating COVID Rules

భారత్ లో రెండో దశ కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. కోవిడ్ వైరస్ కట్టడికి చాలా రాష్ట్రాలు లాక్ డౌన్, కర్య్ఫూ లాంటి ఆంక్షలు ఎన్నో విధించాయి. ఈ క్రమంలోనే ఎక్కువగా మహారాష్ట్రలోనే కోవిడ్ పాజిటివ్ కేసులతోపాటు మరణాలు కూడా నమోదయ్యాయి. భారత్ లో కోవిడ్ కేసులు, మరణాల పరంగా మొదటి నుంచీ మహారాష్ట్రానే ముందుంది. రెండ్ దశ విజ్రుంభిస్తున్న నేపథ్యంలోఉద్ధవ్ ఠాక్రే సర్కార్ కఠిన ఆంక్షలు విధించింది. దీంతోపాటు మొదట్లో కోవిడ్ కేంద్రంగా మారిన ముంబాయిలో కూడా కఠిన చర్యలు తీసుకున్నారు.

కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచి భారీ మొత్తంలో జరిమానా రూపంలో వసూలు చేశారు. బీఎంసీలో మాస్క్ ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతున్న వారి నుంచి 58 కోట్ల జరిమానాను వసూల్ చేశారు. జూన్ 23 తేదీ వరకు ఆ మొత్తాన్ని వసూలు చేసినట్లు బీఎంసీ తెలిపింది. ముంబయి సివిల్ పోలీసులతోపాటు రైల్వే శాఖ ఈ మొత్తాన్ని మాస్క్ లేని వారి నుంచి వసూలు చేసినట్లు తెలిపింది. అయితే మహారాష్ట్రలో రెండో దశ సమయంలో అత్యధిక స్ధాయిలో పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.ప్రతిరోజూ 60 నుంచి 70వేల వరకు కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది.

ఇక తాజాగా గడిచిన ఒక్కరోజులో దేశవ్యాప్తంగా 51వేల కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అదే సమయంలో ఒక్కరోజులోనే కోవిడ్ ప్రభావంలో 13వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక 64527మంది కోవిడ్ మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఈ మేరకు భారత వైద్య ఆరోగ్యశాఖబులెటిన్ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం దేశంలో ఇప్పటి వరకు 30134445 మంది కోవిడ్ బారిన పడ్డారు. వీరిలో 29128267 మంది కోలుకున్నారు. 393310 మంది ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం దేశంలో 612868 కేసులన్నాయి. గద 17రోజులగా కోవిడ్ పాజిటివ్ రేటు 2.91శాతంగాఉంది. ఇక ఈ వారం పాజిటివ్ రేటు 5 శాతం కంటే తక్కువ స్థాయికి పడిపోయింది. ఇదే సమయంలో రికవరీ రేట 96.61 శాతం ఉంది.

Spread the love