రెడ్డిలకే ప్రాధాన్యం…జగన్ పాలనలో ఇంతేనా?

TTD Board Postings

టీటీడీ ప్రస్తుత బోర్డు కాల పరిమితి ఈనెల 21తో ముగిసింది. కోవిడ్ కారణంగా తమ పదవులను పెద్దగా అనుభవించకపోవడంతో జగన్ ఇంకోసారి అవకాశం ఇస్తారని బోర్డు సభ్యులు భావించారు. కానీ అలాంటి ఉద్దేశ్యం ఏం లేనట్టు టీటీడీని ప్రత్యేక అధికారి పాలనలోకి తీసుకొచ్చింది సర్కార్. దాంతో బోర్డు మార్పు తథ్యం అనే సంకేతాలను ఇచ్చింది ప్రభుత్వం. ఇదిలా ఉంటే…టీటీడీ ఛైర్మన్ పదవికి మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి బరిలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన గత ఎన్నికల్లో తన సిట్టింగ్ స్థానాన్ని త్యాగం చేసినందుకు గానూ ఆయనకు టీటీడీ ఛైర్మన్ పదవి ఇస్తామని జగన్ హామీ ఇచ్చారట.

దాంతో ఈసారి మేకపాటికి అవకాశం ఉంటుందట. అయితే ఇదే నిజమైతే జగన్ సర్కార్ మీద విమర్శలు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే గతంలో చంద్రబాబు హయాంలో ఈ పదవిని సొంత సామాజిక వర్గానికి ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు. అయితే వైఎస్ జమానాలో నుంచి జగన్ రూల్ వరకు రెడ్డిలకే టీటీడీ ఛాన్స్ దక్కింది. ఇప్పుడు వైవీ సుబ్బారెడ్డి రెండు సంవత్సరాల పదవి పూర్తి చేసుకున్నారు. మేకపాటికి ఇంకో రెండు సంవత్సరాలపాటు పదవి ఉంటుంది. మేకపాటిని నియమించేలోగా ఇంకో ఆర్నేళ్లు గడుస్తాయంటే చివరి ఆర్నేళ్లు ఇంకొక వర్గానికి చెందిన వారికి ఛాన్స్ ఇచ్చినా ఎలక్షన్ స్టంట్ గానే కనిపిస్తుంది.

Spread the love