భారత్ లో Google మరో పెట్టుబడి..

Google Vodafone Idea Merge

Google ప్రపంచంలో అతి పెద్ద ఇంటర్నెట్ దిగ్గజం. ఇప్పట్లో Google అనే పేరు తెలియని వారుండరు. యావత్ ప్రపంచంలో చాలా మంది Google లో ఉద్యోగం కోసం పరితపించేవారే. ప్రతి ఒక్క మొబైల్, కంప్యూటర్ లో ఖచ్చితంగా ఉండే ఒక సర్వీస్. ఇప్పట్లో ఎవరు తమ బ్రాండ్ ని తమ మార్కెటింగ్ సర్వీసులని పెంచుకోవడానికి ముందుగా ఉపయోగించే సర్వీస్ Google. Google కూడా తమ సర్విస్ లను మెరుగుపరుచుకోవడానికి ఎప్పటికప్పుడు సరికొత్త ప్రతిపాదనలతో వినియోగదారుల ముందుకు వస్తుంది. అయితే ఇప్పుడు Google యొక్క మాతృ సంస్థ అయిన Alphabet, Vodafone Idea లో 5% షేర్లు కొనాలనుకుంటుంది అని Financial Times పేర్కొంది. అయితే ఈ వ్యవహారం ఇంకా తొలిదశలోనే ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

 

అయితే తొలుత Alphabet Jio లో షేర్లు కొనాలని అనుకుంది అయితే ఈ వ్యవహారం తొలిదశలో ఉండగానే సుమారు $5.7 బిలియన్ల తో Facebook Jio షేర్లను సొంతం చేసుకుంది. ఈ కలయికతో Facebook తన స్థానాన్ని భారత్ లో పదిలం చేసుకుంది. Facebook Jio కలయిక తర్వాత సరికొత్త మొబైల్ సేవలను కూడా ఈ సంస్థ ఇండియాలో నెలకొల్పనుంది. అదే తరహాలో Google కూడా తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి Vodafone Idea లో 5% షేర్లను కొననుంది అని Financial Times ప్రచురించింది. Corona నేపథ్యంలో అన్నీ దేశాలలో Lockdown కారణంగా Economy పడిపోయింది కానీ భారత్ లో Telecom సర్విస్ లు మాత్రం అత్త్యుత్తమ సేవలతో తమ షేర్ల విలువను పెంచుకున్నాయి. ఇప్పటికే  Google భారత్ లో android సేవలను మెరుగుపరుచుకుంటుంది. ఇప్పటికే 2017 లో ప్రవేశపెట్టిన Payments సదుపాయంతో Google కి భారత్ లో మంచి ఆదరణ లభించింది.

గమనిక: అన్ని లేటెస్ట్ న్యూస్ మరియు Tech Updates కోసం Telegramలో APPolitrics అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

అమెరికా లో ఉన్న ఎన్నో సంస్థలు చైనా  సంస్థలతో పోటీపడుతున్న నేపథ్యంలో ఇండియాలో మాత్రం AntiChina Products ఉపయోగించకూడదు అనే వాదన బాగా బలపడింది. దీనికి తోడు భారత ప్రభుత్వం కూడా  చైనీయ సంస్థలు భారత్ లో సేవలను అందించదానికి ప్రత్యేక నిభందనలు పెట్టడంతో ఇండియాలో దేశీయ సంస్థలకు మరింత లాభం చేకూరింది ఈ పరిస్తుతుల ధృష్ట్యా Google కూడా Vodafone Idea లో 5% షేర్లను సొంతం చేసుకోనుంది అనే వార్త దేశీయ మార్కెట్లలో చక్కెర్లు కొడుతుంది. Vodafone Idea ప్రస్తుతం ఉన్న మార్కెట్ విలువ ప్రకారం 5% షేర్లు అంటే సుమారు 110 మిలియన్ డాలర్లు. ఇప్పటికే భారత ప్రభుత్వానికి సుమారు 53000 కోట్ల రుణం బకాయి ఉన్నట్లు సమాచారం. అయితే ఈ కొత్త కలయికతో అయినా Vodafone Idea ఈ అప్పుల భారం నుంచి విముక్తి పొందుతుంది. అయితే ఇందులో కీలక సమాచారం ఏంటంటే ఈ విషయమై Google, Vodafone Idea సంస్థ ప్రతినిధులను సంప్రదించగా దీనిపై మాట్లాడేందుకు వారు నిరాకరించారు.

Spread the love