BSNL వినియోగదారులకు తక్కువ ధరకే Google పరికరాలు..

BSNL - Google Devices

BSNL భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్. భారత ప్రభుత్వ టెలికాం సంస్థ. ఒకప్పుడు ఇండియాలో టెలికాం రంగంలో ఒక వెలుగు వెలిగిన సంస్థ. మొబైల్ లేదా లాండ్ లైన్ వాడుతున్న ప్రతి ఒక్కరికీ ఇది సుపరిచితమే. 20 వ దశకంలో ఎక్కడ చూసినా ఎవరి నోట విన్నా ఎవరి ఇంట్లో ఫోన్ మ్రోగినా అధి BSNL పిలుపే. BSNL సేవే. పట్టణాలకే కాకుండా గ్రామీణ, మారుమూల ప్రాంతాలలో కూడా తమ సేవలను విస్తరించి ఎంతో మందికి తమ బందువుల వార్తలను చేరవేసిన సంస్థ. లాభాలే లక్ష్యంగా పని చేయకుండా ప్రజలకు అత్యున్నత సేవలను అందించడమే అంతిమ లక్ష్యంగా పని చేసిన సంస్థ. అయితే తర్వాతి కాలంలో ఎన్నో సరికొత్త టెలికాం సంస్థలు పుట్టుకు రావడం అవి నిభందనలు అతిక్రమించి ఉచిత అపరిమిత కాల్ సేవలను మరియు తాకువ ధరలకే ఇంటర్నెట్ సేవలను అందించడం, అటువంటి పనులు BSNL సంస్థ చేయలేకపోవడం తో ఆ సంస్థ నష్టాల బాట పట్టింది.

 

ఆ సంస్థకు ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడమే దీనికి మూల కారణం. ఇప్పటికీ భారత్ లో కొన్ని టెలికాం సంస్థలకు మాత్రమే 4G సేవలను అందించడానికి అనుమతి ఉంది. అయినా ప్రతి ఒక్క టెలికాం సంస్థ భారత్ లో 4G సేవలను అందిస్తోంది. ప్రభుత్వాలు BSNL యొక్క సేవలను నీరు గార్చే విధంగా ప్రయత్నిస్తున్నారు అని మిగిలిన టెలికాం సంస్థలకు తొలుత అనుమతి ఇచ్చి ప్రభుత్వ సంస్థ అయిన BSNL కు మాత్రం అనుమతి ఇవ్వడంలో జాప్యం కనబరుస్తున్నారని BSNL ఉద్యోగులు పలుమార్లు వాపోయారు. మిగిలిన టెలికాం సంస్థలతో పోటీ పడే విధంగా BSNL కూడా తమకు వీలైనన్ని కొత్త ఆఫర్లతో ఎప్పటికప్పుడు వినియోగదారుల ముందుకు వస్తోంది. అదే విధంగా ఇప్పుడు మరలా BSNL మరో సరికొత్త ఆఫర్ తో వినియోగదారుల ముందుకొచ్చింది. ఇప్పటికే BSNL DSL మరియు Bharat Fiber ఉపయోగిస్తున్న వినియోగదారులను ధృష్టిలో ఉంచుకొని BSNL ఈ సదుపాయాన్ని ప్రజల ముందుకు తీసుకు వచ్చింది.

 

గమనిక: అన్ని లేటెస్ట్ న్యూస్ మరియు Tech Updates కోసం Telegramలో APPolitrics అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

 

ఇప్పుడు ప్రతి ఇంట్లో స్మార్ట్ పరికరాల ఉపయోగం బాగా పెరిగిపోయింది వాటితో పాటుగా మొబైల్ తో అనుసంధానమై ఇంటిలోని ఎన్నో అత్యాధునిక పరికరాలను కంట్రోల్ చేస్తూ ఎప్పటికప్పుడు ఇంట్లోని వారందరికీ చిన్న చిన్న విషయాలలో శ్రమని తగ్గిస్తూ వాయిస్ కమాండ్ తో పని చేసే Google Nest Mini, Google Nest Hub పరికరాలు ప్రతి ఇంట్లో సేవలను అందిస్తున్నాయి. అయితే వీటి విలువ కూడా తక్కువగా ఉండడంతో వీటిని ఉపయోగించేందుకు ప్రజలు ఆసక్తిని కనబరుస్తున్నారు. అయితే ఇప్పుడు BSNL ఈ రెండు పరికరాలను తమ వినియోగదారులకు అతి తక్కువ రేటుకే అందిస్తుంది. ఇప్పటికే ఎవరైతే నెలకి Rs. 799 అంతకంటే ఎక్కువ చెల్లింపు కలిగిన సదుపాయాన్ని వినియోగిస్తున్నారో, వారు ప్రతి నెలా Rs. 99 ల చొప్పున 13 నెలలకు చెల్లిస్తే వారికి Google Nest Mini ని, ఇంకా ఎవరైతే నెలకి Rs. 1999 లేదా అంతకంటే ఎక్కువ చెల్లింపు కలిగిన సదుపాయాన్ని వినియోగిస్తున్నారో వారు ప్రతి నెలా Rs.199 ల చొప్పున 13 నెలలకు చెల్లిస్తే వారికి Google Nest Hub ని BSNL వారు అందించనున్నారు. ఈ వినియోగదారులు ఖచ్చితంగా వారి ఇంటర్నెట్ సేవలకు సంబందించిన సదుపాయానికి సంవత్సరానికి సరిపడా మొత్తాన్ని ముందుగానే చెల్లించి ఉండాలి.. ఈ సదుపాయాన్ని చెన్నై BSNL ఇప్పటికే ఫిబ్రవరి నెల నుంచే అందిస్తోంది. ఇందుకోసం వినియోగదారుల సంవత్సరం మొత్తానికి సరిపడా మొత్తాన్ని ముందుగానే ఒక నెల అదనపు రుసుముతో కలిపి చెల్లించాలి. ప్రైవేట్ ఇంటర్నెట్ సేవలను అందిస్తున్న ACT Fibernet మరియు Airtel కూడా ఈ సేవలను తమ వినియోగదారులకు అందించారు.

Spread the love