సామాజిక దూరం పాటించడం కోసం Google Tool

Google's Sodar

గూగుల్  అంతర్జాల దిగ్గజం. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అందరినీ వణికిస్తున్న కరోనా ను అరికట్టేందుకు ఇప్పటివరకు ఎటువంటి మందు తయారు కాలేదు. మందు తయారు అయ్యేవరకు ప్రజలు తమంతట తాముగా కరోనా ను అరికట్టవలసింధే తప్ప ఎవరూ ఏమి చేయలేరు. అందుకు గాను ప్రజలు సామాజిక దూరం పాటించడమే అందరి ప్రథమ కర్తవ్యం. అందరూ సామాజిక దూరం పాటించడం కోసం Google కొత్తగా ఒక Tool ని కనిపెట్టింది. ఆ Tool పేరే Sodar.

కరోనా ఎవరికైనా సోకినా ఆ వ్యాధి లక్షణాలు బయటపడడానికి సుమారుగా 14 రోజుల సమయం పడుతుంది. అప్పటి వరకు వారికి కరోనా ఉందో లేదో చెప్పలేం. కాబట్టి ప్రజలు ప్రతి ఒక్కరికీ సుమారు 2 మీటర్ల దూరం పాటించడం ఎంతో ఉత్తమం. ఇలా చేయడం ద్వారా ప్రజలు తమను తమ కుటుంబాలను క్షేమంగా ఉంచుకోగలరు. ప్రజలు సామాజిక దూరం పాటించేందుకు ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థలు కొన్ని చర్యలను చేపట్టాయి. అంతే కాకుండా కొన్ని చోట్ల సామాజిక దూరం పాటించేందుకు కొన్ని గుర్తులను కూడా సిద్దం చేశారు. అయితే ప్రతి చోట ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థలు ఇటువంటి గుర్తులు ఏర్పాటు చేయడం సాధ్యం కాదు అలాగే ప్రజలు కూడా ఖచ్చితంగా 2 మీటర్లు దూరం పాటించడం కూడా కాస్త కష్టమే. అయితే ప్రజలకు ఈ కష్టాన్ని తొలగించేందుకు Google’s Sodar Tool ఉపయోగపడనుంది. ఈ Sodar Tool మీ ఫోన్ కెమెరా లో 2 మీటర్ల దూరం లో ఒక తెల్ల లైన్ ను చూపిస్తుంది.

 

గమనిక: అన్ని లేటెస్ట్ న్యూస్ మరియు Tech Updates కోసం Telegramలో APPolitrics అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

 

ఎవరైనా ఆ లైన్ ను దాటి దగ్గరికి వస్తే మీ స్క్రీన్ లో ఒక అలెర్ట్ ను చూపిస్తుంది. ఆ Tool మీ మొబైల్ లేదా వ్యక్తిని మధ్యగా చేసుకొని చుట్టూ 2 మీటర్ల వరకు లైన్ ను చూపిస్తుంది. ఈ సర్విస్ Google Supported Browser మరియు android లలో Augmented Technology  ఉన్న వాటిలో మాత్రమే పని చేస్తుంది. ఈ Tool మీ మొబైల్ లోని Web XR సేవలను ఉపయోగించుకొని 2 మీటర్ల దూరాన్ని చూపిస్తుంది. అదే విధంగా Google కూడా పబ్లిక్ యొక్క Location మరియు వారు ప్రయాణం చేసిన గమ్యాలను ప్రభుత్వానికి అందించేందుకు సిద్దంగా ఉంది. ఈ విపత్కర పరిస్తితులలో ప్రజలకు ఉపయోగపడేలా Google తన యొక్క అన్నీ రకాల సేవలను ప్రజలకు ప్రభుత్వానికి అందించేందుకు సిద్దంగా ఉంది.

Spread the love