రేవంత్ రెడ్డి ప్లాన్…తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తదా?

Revanth reddy Politics in Telangana

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి..మొదటి మెట్టుకు ఆమడదూరంలో ఉన్నాడు. టార్గెట్స్ ఫిక్స్ చేసుకున్నాడు. అధికారమే లక్ష్యంగా ముందుకు అడుగులు వేస్తున్నాడు. తెలంగాణలో కేసీఆర్ సర్కార్ ను టార్గెట్ చేస్తూ…ముఖ్యమంత్రి సీటును అధిరోహించడమే లక్ష్యంగా పనిని ప్రారంభించారు.

టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి తన టార్గెట్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అని ప్రకటించాడు. కేసీఆర్ ను గద్దెదించడం..టీఆరెస్ ప్రభుత్వాన్ని కూల్చివేయడమే తన లక్ష్యమని బాహాటంగానే చెప్పాడు. అయితే కేసీఆర్ ను ఢీకొట్టడం ప్రస్తుతమున్న సమయంలో అంత తేలిక కాదన్న సంగతి రేవంత్ కు తెలుసు. కానీ తలచుకుంటే సాధ్యం కానిదేముంది…ఈ భరోసాతోనే ముందుకెళ్తున్నాడు.

కేసీఆర్ పై నిరుద్యోగమనే మొదటి అస్త్రాన్ని ప్రయోగించబోతున్నాడు. దీంతో టీఆరెస్ సర్కార్ పై యుద్దానికి రెడీ అవుతున్నారని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. ఇదే కాదు..కాంగ్రెస్ పార్టీని తెలంగానలో అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పాదయాత్ర ను మొదలు పెట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటిదాకా తెలుగురాష్ట్రాల్లో పాదయాత్ర చేసిన వారంతా అధికారాన్ని చేజిక్కించుకున్నారు. వైఎస్సార్ నుంచి మొదలుపెట్టి..చంద్రబాబు, వైఎస్ జగన్ వరకు పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయ్యారు.

ఇక ప్లాన్ ప్రకారం రేవంత రెడ్డి మొదటిలో సక్సెస్ అయ్యాడు. పీసీపీ చీఫ్ గా సెలక్టయ్యాడు. ప్లాన్ బి ఇప్పుడు టార్గెట్ ముఖ్యమంత్రి పదవిని పెట్టుకున్నాడు. కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చి ముఖ్యమంత్రి కావడం కోసం…రేవంత్ రెడ్డి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాడు. ఇప్పటికే తన టీం ను కూడా సిద్ధం చేసుకున్నాడు. సామాజిక మాధ్యమాల్లో రేవంత్ రెడ్డి సైన్యం హల్ చల్ చేస్తోంది. కేటీఆర్ టీంలాగే రేవంత్ టీంలు సామాజిక మాధ్యమాల్లో పనిని మొదలు పెట్టాయి. రేవంత్ రెడ్డి ఇప్పుడు రెడ్డీలేకాదు…బీసీలను కూడా తన వైపు తిప్పుకోవాలన్న స్ట్రాటజీతో ముందుకు దూసుకెళ్తున్నాడు.

రేవంత్ రెడ్డి ఇప్పుడు పార్టీలోని సీనియర్లను కలపుకుని మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. అధిష్టానం ఆదేశాలతో సీనియర్లు రేవంత్ రెడ్డితో సాగేందుకు సిద్ధం అవుతున్నారు. కేవలం గాంధీభవన్ లో ఉండి విమర్శలు చేస్తే సరికాదని…ప్రజామద్దతును కూడగట్టడం..వారిలో ఒక ముద్ర వేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ మంచి రిజల్ట్ ఇస్తుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.

ఇక రేవంత్ రెడ్డి జూలై 7న తెలంగాణ పీసీపీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించునున్నారు. అదే రోజు తన భవిష్యత్ కార్యాచరణను కూడా ప్రారంభించనున్నాడు. ముఖ్యంగా పాదయాత్ర ప్రకటిస్తారని తన వర్గీయులు చెబుతున్నారు. ఆలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు తెలంగాణలో మొత్తం 33 జిల్లాలను కలపుకుని ఈ పాదయాత్ర ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక రేవంత్ ప్లాన్ కు అధిష్టానం కూడా మద్దతు తెలిపింది. దీంతో మరింత జోష్ మీదున్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ రాజకీయాలను ఓ ఊపు ఊపేలా రేవంత్ రెడ్డి పాదయాత్ర ఉండనున్నందనే టాక్ వినిపిస్తోంది.

Spread the love