శ్రీవారి ప్రతిష్టతను దెబ్బతిసేలా జగన్ సర్కార్ కుట్ర

Ex TTD Chairman Putta Sudhakar Yadav Comments on YS Jagan

టీటీడీపై ప్రభుత్వం స్పెసిఫైడ్ అథారిటీ వేయడంలో ఉన్న మర్మమేంటీ… అని టీటీడీ మాజీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ ప్రశ్నించారు. పాలకమండలిని కాదని అథారిటీని నియమించడం వెనక ఏదో పెద్ద కుట్ర జరుగుతుందన్న అనుమానం కలుగుతుందన్న సందేహాన్ని వ్యక్తం చేశారు.

తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ విక్రయ కౌంటర్లను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం హిందూభక్తుల మనోభావాలు దెబ్బతీయడమే అన్నారు. ఎంతో పవిత్రంగా, నిష్టతో తయారు చేసే స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని చాలామంది సిబ్బంది నిత్యం స్వామివారి సేవలో తరిస్తూ… విక్రయ కేంద్రాల్లో భక్తులకు ఉచితంగా అందిస్తున్నారు. అలాంటి ప్రసాద వితరణ కార్యక్రమాన్ని బయట వ్యక్తులకు అప్పగిస్తే… ఇష్టానుసారంగా వారికి నచ్చిన ధరలకు అమ్ముకునే ఛాన్స్ ఉందని అభిప్రాయ పడ్డారు.

స్వామివారి ప్రసాదానికి ఎంతో విశిష్టత ఉంది. దీన్ని మంటగలిసేలా స్పెసిఫైడ్ అథారిటీ నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. ప్రసాద విక్రయాల పేరుతో పెద్ద స్కామ్ జరిగే అవకాశం కూడా ఉందన్నారు.
స్వామివారి పేరుతో బ్యాంకుల్లోఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లు తాలూకు సొమ్మును, ఆస్తులను కాజేయడానికే స్పెసిఫైడ్ అథారిటీని నియమిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇక స్వామివారికి భక్తులు సమర్పించే కానుకలు, ఇతర విలువైన వస్తువులు కూడా స్వాహాకు కుట్ర జరుగుతుందన్నారు. అదేగానీ జరిగితే టీటీడీ తోపాటు స్వామివారి ఖ్యాతి, విశిష్టత మంటగలిసే ప్రమాదం ఉందన్నారు. హిందువులు, శ్రీవారి భక్తుల మనోభావాలను గౌరవించి సర్కార్ వెంటనే స్పెసిఫైడ్ అథారిటీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

Spread the love