రఘురామకు జగన్ కు ఎక్కడ చెడిందో తెలిస్తే షాక్..

Controversy between YS Jagan and Raghu rama Krishnam Raju

రఘురామ కృష్ణం రాజు అరెస్టు ఎపిసోడ్ ఏపీ రాజకీయాల్లో కాక పుట్టిస్తోంది. సొంత పార్టీ ఎంపీపైనే జగన్ ప్రభుత్వం కేసులు పెట్టి అరెస్టు చేయించడం, అంతా ఓ ప్రహసనంలా సాగింది. కానీ అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే..రఘురామ కృష్ణం రాజు స్వయంగా అధికార పార్టీ వైఎస్సార్సీపీ ఎంపీనే కావడం కొసమెరుపు. అయితే గడిచిన ఏడాది కాలంగా తమ సొంత ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగరవేసిన రఘురామ కృష్ణం రాజు అలియాస్ ఆర్ఆర్ఆర్. జగన్ ప్రభుత్వంపై వరుసగా విరుచుకుపడుతున్నారు. నర్సాపూర్ ఎంపీగా వైసీపీ నుంచే గెలిచిన రఘురామ కృష్ణం రాజు, తొలి నుంచి తన వివాదాస్సద వ్యాఖ్యలతోనూ, చర్యలతోనూ జగన్ మోహర్ రెడ్డికి కంట్లో నలుసుగానే ఉంటూ వచ్చారు. నిజానికి రఘురామ అధినేత జగన్ తో కాంప్రమైజ్ అయిపోయి, ఇతర ఎంపీల లాగే సైలెంటుగా ఉండొచ్చు. కానీ ఆయన జగన్ తో ఢీ అంటే ఢీ అనే స్థాయికి వెళ్లడం వెనుక, కేంద్రంలోని బీజేపీ అండదండలతోనే ఆయన అలా చెలరేగిపోతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గతంలో బీజేపీ పార్టీలోనే ఉన్న రఘురామ కృష్ణం రాజుకు, కేంద్రంలోని పెద్దలతో సత్సంబంధాలు ఉన్నాయి. ఆ అండతోనే ఆయన జగన్ ప్రభుత్వంపై ఒంటి కాలిపై లేచి నిలబడుతున్నారనే అపవాదు ఉంది.
నిజానికి రఘురామ కృష్ణం రాజుకు దివంగత నేత వైఎస్సార్ తో మంచి రిలేషన్ ఉంది. వైఎస్ ఆత్మీయుడు కేవీపీ రామ చంద్రరావుకు రఘురామ కృష్ణం రాజు స్వయంగా వియ్యంకుడు. కేవీపి ఇంటికి రఘురామ తన కుమార్తెను కోడలుగా పంపారు. అప్పటి నుంచే వైఎస్ కుటుంబంతోనూ రఘురామ సన్నిహితుడుగానే ఉన్నారు. అయితే 2014 ఎన్నికలకు ముందు కూడా రఘురామ వైఎస్సార్సీపీలో చేరి నర్సాపురం టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేశారు. అయితే చివరి నిమిషంలో టిక్కెట్ దక్కకపోవడంతో ఆయన బీజేపీలో చేరారు. అయితే 2019లో మాత్రం నర్సాపురంలో వైఎస్సారీపీకి బలమైన అభ్యర్థులు లభించలేదు. దీంతో మరోసారి ఆ పార్టీకి రఘురామ కృష్ణం రాజు దిక్కు అయ్యారని, నియోజక వర్గంలో రఘురామ పోటీ చేస్తేనే, జిల్లాలోని బలమైన సామాజిక వర్గం పార్టీకి అండగా నిలుస్తుందని, భావించి జగన్ స్వయంగా రఘురామను రిక్వెస్ట్ చేసి బరిలోని నిలిపారనే వార్తలు వచ్చాయి. అయితే మొదటి నుంచి జగన్ యాటిట్యూడ్ ను విబేధించిన రఘురామ, ఢిల్లీలో ఉండగా బీజేపీ పెద్దలను కలవడం, సీఎంకు కూడా దొరకని అపాయింట్ మెంట్స్ రఘురామకు క్షణాల్లో లభించడం వంటివి సీఎం జగన్ మోహన్ రెడ్డికి రుచించలేదు. దీంతో నియోజకవర్గంలో మరో బలమైన వర్గమైన గోకరాజు గంగరాజు కుటుంబాన్ని వైసీపీలోకి ఆహ్వానించి రఘురామ గేట్లను క్లోజ్ చేశారు. దీంతో రఘురామ అధినేత జగన్ పైనే విమర్శలు ఎక్కుపెట్టిన వ్యవహారం అరెస్టు దాకా వచ్చింది.

Spread the love