మోదీ ప్రభ మసకబారుతోందా…వన్ మాన్ షో కొంప ముంచుతోందా..

Modi Failure in COVID Crisis Management

కరోనా మొదటి దశను సమర్థవంతంగా ఎదుర్కొన్న భారత ప్రధాని నరేంద్రమోదీని అంతర్జాతీయ మీడియా ఆకాశానికెత్తేసింది. ఆనాడు ట్రంప్ యూరప్ దేశాధినేతలు వైఫల్యాన్ని తీవ్రంగా ఎండగట్టాయి. కానీ నవ్వే వారి ముందు జారిపడ్డట్లు మన పరిస్థితి తయారైంది.. వైఫల్యాలను సమర్థవంతంగా ఎదుర్కొన్న దేశాలు…వ్యాక్సిన్లు ముందస్తు చర్యలతో ఇప్పుడు రెండో దశ కరోనా నుంచి బయటపడ్డారు. మొదటిదశను విజయవంతంగా జయించామని బుజాలు తడుముకున్న మోదీ…ఇప్పుడు భారత్ రెండో దశ కరోనాకు బలికావాల్సి వస్తోంది. మనం చేసిన తప్పులే మనకు మెడకు చుట్టుకుంటాయన్న సామేత మోదీ విషయంలో నిజమైందంటున్నారు విశ్లేషకులు.

ఒకనాడు మోదీని ఆహో…ఓహో అని పొగిడిన ఇంటర్నేషనల్ మీడియా..ఇప్పుడు మాత్రం మోదీ చేసిన తప్పులను అదేపనిగా చూపిస్తూ…కథనాలు రాస్తున్నాయి. ఒకదశలో ఆయన పరువును రచ్చకీడుస్తున్నాయి. కరోనా మొదటి దశలో దేశంలో లాక్ డౌన్ విధించి మోదీ కరోనాను కంట్రోల్ చేశారని..ఆయన హీరో అంటూ…అంతర్జాతీయా మీడియా భజన చేసింది. కానీ ఇప్పుడు రెండో దశకు వచ్చేసరికి మోదీ పాలనను ఎత్తిచూపుతున్నాయి.

భారత్ ను కరోనా కకావికాలం చేస్తోందని…లక్షల కేసులు…వేల మరణాలు సంభవిస్తున్నాయని రాసుకొస్తుంది. ప్రాణవాయువు అందక వందల సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయి. భారత్ లోని కరోనా కల్లోలం పరిస్థితిపై అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. భారత్ లో మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును తాజాగా అంతర్జాతీయ మీడియా ద్వజమెత్తుతోంది. మోదీ నాయకత్వంలో దేశంలో పరిస్థితులన్నీ కూడా చేజారిపోయానని…దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటొందని విమర్శలు చేస్తోంది.

రెండో దశ కరోనా విజృంభిస్తున్న వేళ…దేశంలో ఎలక్షన్స్ పెట్టి రాజకీయ ప్రచారాలు చేయడం….మహా కుంభమేళాలను నిర్వహించడానికి అనుమతులివ్వడం…వీటన్నింటిపై అంతర్జాతీయ మీడియా మోదీ సర్కార్ ను కడిగిపారేస్తోంది. వీటివల్లే భారత్ లో కరోనా విలయ తాండవం చేస్తోందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.

ఫస్ట్ వేవ్ లో న్యూయర్క్ టైమ్స్, లండన్ సండే టైమ్స్….ఇలా అన్ని దేశాలకు చెందిన ప్రముఖ పత్రికలు మోదీ మొదటి దశను సమర్థవంతంగా ఎదుర్కొన్నారని పొగిడాయి. ఇప్పుడు అవే పత్రికలు మోదీ వైఫల్యాలు అంటూ ఆడుకుంటున్నాయి. మోదీకి పని కంటే…పబ్లిసిటీకే ప్రాధాన్యం ఇస్తారంటూ..తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. అన్ని దేశాలకు చెందిన పేపర్లు ఇప్పుడు భారత్ లో నెలకొన్న పరిస్థితుల పైనే కథనాలు రాస్తున్నాయి. మీడియా మేనేజ్ మెంట్ లో తనదే పైచేయి అని మోదీ భావించారు…కానీ ఇప్పుడు దేశంలో నెలకొన్న పరిస్థితులతో ఆయన ఇమేజ్ కాస్తా డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఏర్పడిందని పత్రికలే విమర్శిస్తున్నాయి. మోదీ ప్రచారాలు కేవలం ఆర్భాటాలకోసమే…కరోనాను అదుపులోకి తీసుకురాలేకపోయారన్న విమర్శలు గుప్పుమంటున్నాయి.

Spread the love