YouTube ప్రియులకు మరో శుభవార్త…

YouTube Bed Time Reminder

YouTube ఇప్పట్లో ఉన్న ప్రతి ఒక్క మొబైల్ లో ఉండే ఒక కామన్ ఫ్యూచర్.. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో వీడియో స్ట్రీమింగ్ మరియు వీడియో లు చూడటానికి ఎన్నో యాప్ లు అందుబాటులో ఉన్నా దాదాపుగా 93% మంది వీడియోలు చూడటానికి YouTube ని మాత్రమే ఉపయోగిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఒక్క అమెరికా నుంచే YouTube కి 15% Viewership లభిస్తుంది. ఇండియా నుంచి దాదాపుగా 8% Viewership ఉంటుంది. ప్రతి ఏటా YouTube ను ఉపయోగించే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా సగటున 11 నిమిషాల పాటు YouTube ని వీక్షిస్తున్నారు. ప్రతి నిమిషానికి YouTube లో అప్లోడ్ అయ్యే వీడియోలు సుమారుగా 500 గంటల నిడివి.
ఒక్క అమెరికా నుంచే YouTube 2020 సంవత్సరంలో దాదాపుగా 500 బిలియన్ డాలర్లను యాడ్స్ రూపంలో పొందింది. YouTube ను చూసే వారిలో 70% మంది Mobile నుంచి ఉపయోగించే వారే. ఎప్పటికప్పుడు యాడ్స్ పైనే కాక ప్రజల ఆరోగ్యం, శ్రేయస్సు పైన కూడా ఎక్కువ ధృష్టి సారించే YouTube ఇప్పుడు మరో కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. Covid 19 ప్రపంచ వ్యాప్తంగా ప్రభలుతున్న సమయంలో అన్నీ దేశాల ప్రభుత్వాలు Covid 19 వ్యాప్తిని అరికట్టేందుకు LockDown ని అమలు చేసిన సంగతి తెలిసింధే. ఈ LockDown సమయంలో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ ఖాళీ సమయంలో ఎక్కువ మంది YouTube లో వీడియో లను చూసేందుకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఇక రాత్రి సమయాల్లో కూడా నిద్ర సమయం దాటిన తర్వాత కూడా YouTube చూస్తూ తమ సమయాన్ని కూడా మర్చిపోతున్నారు. దీని వల్ల ఎంతో మంది ఆరోగ్యం పాడు అవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అందుకని YouTube ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ధృష్టి పెట్టింది.

గమనిక: అన్ని లేటెస్ట్ న్యూస్ మరియు Tech Updates కోసం Telegramలో APPolitrics అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

ఇప్పటికే ఎన్నో మొబైల్ లలో అందుబాటులో ఉన్న Digital Wellbeing తో అనుసంధానం చేసుకొని Bed Time Reminders సదుపాయాన్ని అందుబాటు లోకి తీసుకు వచ్చింది. ఈ సదుపాయంతో ఎవరైనా ఎక్కువ సేపు రాత్రులు YouTube లో వీడియో లు చూస్తునపుడు ఆటోమేటిక్ గా ఈ ఫీచర్ Bed Time Reminder ను అలెర్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఆటోమేటిక్ గా మీ YouTube స్క్రీన్ మీద మీరు నిద్రపోయే సమయం దగ్గర పడింది అని చూపిస్తుంది. దీనికి సంబందించిన సెటింగ్స్ ను YouTube తాజాగా అప్డేట్ చేసింది. అయితే మామూలుగా మనం అలారం ని ఎలా ఆఫ్ చేస్తామో అలాగే YouTube లో ఏదైనా వీడియో చూస్తున్నపుడు ఆ వీడియో ను పూర్తిగా చూసేంతవరకు స్నూజ్ లో పెట్టుకునే సదుపాయం కూడా ఉంది. అండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ఆధారంగా పనిచేసే మొబైల్ లలో ఈ సదుపాయాన్ని దశల వారీగా అందుబాటులోకి తీసుకురానుంది. ఒకవేళ ఇప్పటికీ ఈ సదుపాయం మీ మొబైల్ లలో రాకపోతే ఒకటి రెండు రోజుల్లోనే ఈ సదుపాయం మీకు కూడా లభిస్తుంది. అదేపనిగా YouTube చూసేవారికోసం ఇప్పటికే Take a Break సదుపాయం అందుబాటులో ఉన్నప్పటికీ ఇక నుంచి Bed Time Reminder కూడా వారికి సేవలను అందించనుంది. మరి ఈ సదుపాయంతోనైనా మన YouTube ప్రియులు సమయానికి నిద్రపోతారో లేదో వేచి చూడాలి.

Spread the love