Whatsapp లో మరోకొత్త సదుపాయం..

Whatsapp Contacts

Whatsapp ప్రపంచంలో ఎన్నో మెసేజ్ సర్వీసులు ఉన్న కానీ మెసేజ్ అనగానే మనకి మొదట గుర్తుకు వచ్చే సర్విస్ Whatsapp. 2009 లో స్థాపించబడిన ఈ సంస్థ అనతి కాలంలో నే ఎంతో ఆదరణ పొందింది. 2014 లో Facebook సంస్థ Whatsapp ని 19 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా Whatsapp ని 2 బిలియన్ల ప్రజలు ఉపయోగిస్తున్నారు. ఒక్క ఫిబ్రవరి 2020 లోనే 96 మిలియన్ల ప్రజలు Whatsapp ని డౌన్లోడ్ చేసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 180 దేశాలలో సుమారు 60 భాషలలొ Whatsapp తన సేవలను విస్తరించింది. ఒక్క మన దేశంలోనే 340 మిలియన్ల ప్రజలు Whatsapp ని వినియోగిస్తున్నారు. ఒక రోజుకి సుమారుగా 65 బిలియన్ల మెసేజ్ లను Whatsapp నుంచి పంపిస్తున్నారు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా తన సేవలను రోజు రోజుకీ విస్తరించడమే కాకుండా

ఎప్పటికప్పుడు కొత్త సర్వీసులను అందించడంలో కూడా Whatsapp ముందుంది. ఆడియో కాల్స్, వీడియొ కాల్స్, స్టిక్కర్స్ వంటి సదుపాయాలు దశల వారీగా Whatsapp లో వచ్చినవే. ఈ మధ్యనే Whatsapp గ్రూప్ వీడియో కాల్స్ సదుపాయాన్ని కూడా ప్రారంబించింది. తొలుత కేవలం నలుగురు మాత్రమే ఉపయోగించుకునేలా ఉన్న ఈ సదుపాయాన్ని తర్వాత 8 మంది ఉపయోగించుకునేలా Whatsapp తన సర్వీసులను అభివృద్ధి చేసుకుంది. అయితే మరలా ఇప్పుడు Whatsapp మరో కొత్త సర్వీసుతో ప్రజల ముందుకి రానుంది. ఇప్పటి వరకు మనం ఎవరైనా కొత్త వ్యక్తికి Whatsapp లో మెసేజ్ పంపించాలి అంటే ముందుగా వారి నెంబర్ ని మన ఫోన్ బుక్ లో సేవ్ చేసుకొని ఆ తర్వాత మాత్రమే మన మెసేజ్ ని పంపగలిగేలా సదుపాయం ఉండేది. అయితే ఇప్పుడు దానికి భిన్నంగా నెంబర్ ని సేవ్ చేసుకోవడానికి బదులుగా వారి నెంబర్ యొక్క QR Code ని మన ఫోన్ లోని కెమెరా ద్వారా స్కాన్ చేసుకొని డైరెక్ట్ గా మన ఫోన్ బుక్ లో వారి నెంబర్ ని సేవ్ చేసుకునే సదుపాయాన్ని Whatsapp కల్పించనుంది.

గమనిక: అన్ని లేటెస్ట్ న్యూస్ మరియు Tech Updates కోసం Telegramలో APPolitrics అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

ఇకపై ఎవరైనా ఇతరుల నెంబర్ ని సేవ్ చేసుకోవాలంటే వారిని వారి నెంబర్ ని అడిగి తెలుసుకునే పని లేకుండా కేవలం వారి QR Code ని స్కాన్ చేస్తే సరిపోతుంది. ఈ కోడ్ సహాయంతో మనం ఇక మీదట ఎవరి నెంబర్ ని అయినా సులభంగా సేవ్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు కోడ్ స్కానర్ సదుపాయం కేవలం Whatsapp Web సదుపాయాన్ని ఉపయోగించడానికి మాత్రమే ఉపయోగపడేది. ఇక మీదట ఈ సదుపాయంతో మనం నెంబర్ ని కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇప్పటికే పలు యాప్ లలో QR Code Scanner ద్వారా మనం డబ్బులను పంపించే సేవలను ఉపయోగిస్తున్నాం. భవిష్యత్తులో మరెన్నో సదుపాయాలను కూడా QR Code ద్వారా మనం పొందవచ్చు. మరికొద్ది రోజుల్లో Whatsapp బీటా వర్షన్ వాడే వినియోగదారులకు ఈ సదుపాయాన్ని Whatsapp సంస్థ అందించనుంది.

Spread the love