యు ట్యూబ్ గురుంచి ఆసక్తికర విషయాలు…

యూ ట్యూబ్ అంటే ప్రస్తుతం తెలియని వారుండరు కాసేపు కాస్త సమయం దొరికినా మొబైల్ లో ఇంటర్నెట్ ఉంటే చాలు మొదట ఓపెన్ చేసేది యూ ట్యూబ్ ఇది ఎవరు కాదనలేని సత్యం అయితే యూ ట్యూబ్ గురుంచి చాలా మందికి తెలియని కొన్ని ఆసక్తికర అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం. మొట్ట మొదట గా యూ ట్యూబ్ ను 2005 ఫిబ్రవరి 14 న ప్రేమికుల రోజున మొదలు పెట్టారు. పే పాల్ లో పనిచేస్తున్న ఇద్దరు, జూవెద్ కరీం తో కలిసి దీనిని స్టాపించారు. ఆ తర్వాత 2006 లో గూగుల్ సంస్థ యూ ట్యూబ్ ని కొనుగోలు చేసింది. తొలిసారిగా 2007 లో గూగుల్ యూ ట్యూబ్ లో ప్రకటన సేవలను మొదలు పెట్టింది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాలు 25 సార్లు యూ ట్యూబ్ కంటెంట్ ను బ్లాక్ చేశాయి. ప్రస్తుత యూ ట్యూబ్ వార్షిక ఆదాయం సుమారు 15 బిలియన్ డాలర్లు. మన దేశం లో సగటున ప్రతి ఒక్కరూ నెలకు ఒక్క సారైనా ఒక వీడియొ ను చూస్తున్నారు. మొత్తం గా యూ ట్యూబ్ లో ఇప్పటివరకు 7 బిలియన్ వీడియొ లు ఉన్నట్టు అంచనా అంటే సుమారుగా ఒక వ్యక్తి 58 వేల సంవత్సరాలు చూడడానికి సరిపోయే కంటెంట్ యూ ట్యూబ్ లో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా నిమిషానికి యూ ట్యూబ్ లో 72 గంటల వీడియొ అప్లోడ్ అవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా రెండో అతి పెద్ద వెబ్సైట్ గా యూ ట్యూబ్ నిలిచింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *