Resume అప్లోడ్ చేస్తున్నారా..?

Resume

Jobs కోసం Resume అప్లోడ్ చేస్తున్నారా..?

Resume అంటే తెలియని వారుండరు. మనకి జాబ్ కావాలంటే మొదటగా మనం సిద్దం చేసుకోవాల్సింది Resume నే. అందులో మనకి సంబందించిన ప్రతి ఒక్క సమాచారం ఉంటుంది. అయితే CYBIL అనే ప్రముఖ ఇంటెలిజెన్స్  సంస్థ సాధారణంగా జరిపిన చెకప్ లో కొన్ని భయంకర నిజాలు వెల్లడయ్యాయి. భారత విద్యా సాంకేతిక సంస్థ అన్-అకాడమీ సంస్థపై జరిగిన హ్యాకింగ్ దాడిని కూడా ఈ సంస్థే వెల్లడించింది.

CYBIL సంస్థ సాధారణంగా Dark Web, Deep Web ని చెక్ చేస్తూ ఉంటుంది. సైబర్ నేరగాళ్ల గురుంచి, వారు చేసే మోసాల గురుంచి తెలుసుకునేందుకు ఈ సంస్థ రెగ్యులర్ గా ఈ చెకప్ చేస్తూ ఉంటుంది. అలాగే రీసెంట్ గా CYBIL సంస్థ చేసిన ఒక చెకప్ లో సుమారు 2.9 కోట్ల మంది భారతీయుల Resume లు ఆ వెబ్సైట్ లో కనిపించాయి. దీనితో వారు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. సాధారణంగా ఉద్యోగాల కోసం నిరుద్యోగులు Resume అప్లోడ్ చేసే జాబ్ పోర్టల్స్ నుంచి ఈ సమాచారాన్ని సేకరించి అందులో పొందుపరిచారు. Threat Actor పేరుతో ఉన్న ఒక అక్కౌంట్ నుంచి సుమారు 2.3 GB ఉన్న ఒక జిప్ ఫైల్ అప్లోడ్ అయింది. దాన్ని CYBIL సంస్థ ఓపెన్ చేసి చూడగా అందులో సుమారుగా 2.9 కోట్ల భారతీయుల సమాచారం పొందుపరచబడి ఉంది.

 

గమనిక: అన్ని లేటెస్ట్ న్యూస్ మరియు Tech Updates కోసం Telegramలో APPolitrics అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

 

అందులో ముఖ్యంగా ప్రతి ఒక్కరి చదువుకి సంబందించిన వివరాలు, వారి అడ్రెస్ మరియు ఇతర విషయాలు కూడా పొందుపరిచబడి ఉన్నాయి. మరీ ముఖ్యంగా అత్యంత గోప్య సమాచారమైన ఫోన్ నెంబర్లు, వారి మెయిల్ ఐడి, వారు పుట్టిన తేదీ మరియు వారి Work Experience కూడా ఉన్నాయి. దీని పై తదుపరి విచారణను కూడా CYBIL సంస్థ వారు కొనసాగిస్తున్నారు. ఇంకా సైబర్ నేరగాళ్ళు ఇంకేమైనా సమాచారాన్ని కూడా ఇందులో ఉంచారేమో అనే అనుమానంతో తమ విచారణను కొనసాగిస్తున్నారు. ఇక మీదట మనం Resume అప్లోడ్ చేసేటపుడు ఆ జాబ్ పోర్టల్ ని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని అప్లోడ్ చెయ్యడం మంచిది. ఎందుకంటే మన గోప్యమైన సమాచారం అయినటువంటి ఫోన్ నెంబర్, ఈమెయిల్ సహాయంతో సైబర్ నేరగాళ్ళు మరిన్ని నేరాలకు పాల్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి జాబ్ పోర్టల్ లో Resume లను అప్లోడ్ చేసిన నిరుద్యోగులు తమ విలువైన సమాచారాన్ని ఎవరికీ షేర్ చేయకుండా ఉంటే మంచిది.

Spread the love