సుశాంత్, పదుల్లో కేసులు, వందల్లో మలుపులు, నిందితులు?

Sushant case

తీగ లాగితే డొంక అంతా కదులుతుంది అనేది పాత కాలం సామెత. అయితే ఈ మధ్య కాలంలో ఈ సామెత వాడటం పరిపాటి అయ్యింది. అయితే ప్రముఖ బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజ్ పుత్ సింగ్ కేసులో ఈ సామెత నిజమైనట్లు తెలుస్తుంది. సుశాంత్ చనిపోయిన తొలిరోజు అతనిది ఆత్మహత్య అని, తనకు సినిమా అవకాశాలు రాకుండా బాలీవుడ్ లో కొందరు ప్రయత్నిస్తున్నారని వారి మీద చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా లో వార్తలు హల్ చల్ చేసింది..

అయితే తర్వాత అది ఆత్మహత్య కాదని తన కుమారుడిని కావాలనే చంపి ఆత్మహత్య గా చిత్రీకరించారని సుశాంత్ తల్లితండ్రులు సుప్రీం కోర్టు ని ఆశ్రయించడంతో కోర్టు ఈ కేసుని సిబిఐ కి బదిలీ చేసింది. అప్పటి నుంచి కేసులో ఎన్నో మరెన్నో మలుపులు చోటు చేసుకున్నాయి. సుశాంత్ కేసులో అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిని విచారించారు. ఈ విచారణలో ఎన్నో కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి. విచారణ కొనసాగుతుండగానే ఇద్దరు ఇప్పటికే సిబిఐ కి సరెండర్ అయ్యారు.

విచారణలో రియా చక్రవర్తి వెల్లడించిన విషయాల్లో డ్రగ్స్ కోణం ఉందని సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంలో కూడా డ్రగ్స్ కోణం ఉందని సిబిఐ అధికారులు భావించారు. వెంటనే సిబిఐ అధికారులు కేసును ఆ కోణంలో పరిశీలించడం మొదలు పెట్టారు. దీనితో బాలీవుడ్ లో డ్రగ్స్ దందా యధేచ్చగా కొనసాగుతుందని అధికారులు భావించారు. దీనితో ఈ కేసు తదుపరి విచారణని నార్కోటిక్స్ బృందంతో కలిసి విచారణ కొనసాగిస్తున్నారు. ఇందులో ఇప్పటికే పలువురు పేర్లను రియా చక్రవర్తి బయటపెట్టినట్లు అధికారులు వెల్లడించారు. రియా ని కస్టడీ కి తీసుకొని రిమాండ్ కి తరలించారు. ఈ డ్రగ్స్ కేసులో బాలీవుడ్ లో ఎంతో మంది ప్రముఖులు బయటపడతారని నిపుణుల అంచనా.

ఈ డ్రగ్స్ విషయంలో ఎంతో మంది ప్రముఖులు బాలీవుడ్ లో డ్రగ్స్ వాడకం యధేచ్చగా జరుగుతుందని ట్విట్టర్ లో వెల్లడించారు. అయితే ఈ విషయంలో కంగనా చేసిన వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో దుమారం రేపుతున్నాయి. సుశాంత్ కేసులో మహారాష్ట్ర పోలీసుల విచారణ తీరును కంగనా తీవ్రంగా ఖండించారు. పైగా ముంబై లో ప్రస్తుత పరిస్థితి పీఓకే లో ఉన్నట్లు ఉందని ఆమె వ్యాఖ్యానించారు. దీనిపై ఆగ్రహించిన శివ సేన నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ విషయంపై స్పందించిన కేంద్రం కంగనా కు వై కేటగిరి భద్రతను కలిగించింది. దీనితో కంగనా తాను ముంబై కి వస్తున్నానని ఏం చేసుకుంటారో చేసుకోమని తనకి భయం లేదని బహిరంగ వ్యాఖ్యలు చేశారు. అయితే కంగనా ముంబై లో అడుగుపెడితే ప్రస్తుతం ఉన్న కోవిడ్ నిభందనల ప్రకారం తను ఒక వారం రోజులు హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని అధికారులు వెల్లడించారు. కంగనా ఈ స్థాయిలో మండిపడటం వెనుక రాజకీయ కోణం ఉందని నిపుణుల అంచనా.

 

ఇన్ని మలుపులతో కొనసాగుతున్న సుశాంత్ కేసు విచారణ మున్ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో అని అంతా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.

Spread the love